- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొనసాగుతున్న జూబ్లీహిల్స్ కౌంటింగ్.. ఇంటికి వెళ్లి పోయిన బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి
by Muthe.Rajitha |
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతున్న సంగతి తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్ : జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతున్న సంగతి తెలిసిందే. కౌంటింగ్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీలో దూసుకుపోతుండగా.. బీజేపీ పూర్తిగా వెనుకంజలో ఉంది. ఇప్పటి వరకు జరిగిన 6 రౌండ్లలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత 29007 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 38566 ఓట్లు సాధించగా.. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కేవలం 7296 ఓట్లు మాత్రమే సాధించారు.
అయితే 7వ రౌండ్ కౌంటింగ్ జరుగుతుండగానే దీపక్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికి వెళ్ళిపోయారు. కాగా 7వ రౌండ్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 4017 ఓట్ల మెజారిటీ సాధించగా.. మొత్తం 19812 ఓట్ల ఆధిక్యంలో నవీన్ యాదవ్ దూసుకుపోతున్నారు.
Next Story






