- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మేం అధికారంలోకి రాగానే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయి.. కాంగ్రెస్ ఎంపీ కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒకే తాటి మీద నడుస్తున్నాయని భువనగిరి (Bhuvanagiri) కాంగ్రెస్ ఎంపీ (Congress MP) చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒకే తాటి మీద నడుస్తున్నాయని భువనగిరి (Bhuvanagiri) కాంగ్రెస్ ఎంపీ (Congress MP) చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) అన్నారు. హెచ్‌సీయూ వ్యవహారంపై మీడియాతో మాట్లాడిన ఆయన.. బీఆర్ఎస్, బీజేపీ లు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన.. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ (BRS), కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ (BJP) మంచి అండర్‌స్టాండింగ్ తో ముందుకు పోతున్నాయని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ రెండు పార్టీలు ఒకటయ్యాయని ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి కాంగ్రెస్ పార్టీ (Congress Party) చేస్తున్న కార్యక్రమాలపై ఆవేశంతో విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు.
కొందరు సోషల్ మీడియాను వేదికగా చేసుకొని మార్ఫింగ్ చేసిన ఫోటోలను పోస్ట్ చేస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ కు చెందిన సోషల్ మీడియా పెయిడ్ ఆర్టిస్టులు (BRS Social Media Paid Artists) హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (Hyderabad Central University) విషయంలో ఎన్నో అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వివిధ రాష్ట్రాల్లో ఉన్న సోషల్ యాక్టివిస్టులను, ఎన్విరాన్‌మెంటలిస్టులను సైతం తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నడిబొడ్డున పులులు, సింహాలు, ఏనుగులు వంటి జంతువులు సంచరిస్తున్నాయని, జూపార్క్ కంటే ఎక్కువ జంతువులు అక్కడ ఉన్నాయని ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. అంతేగాక ఇలాంటి వాళ్లు తప్పుడు ప్రచారాలతో దేశాన్నే కన్ఫ్యూజ్ చేస్తున్నారని చామల ఫైర్ అయ్యారు.






