Seethakka: బీసీ రిజర్వేషన్లకు బీజేపీ మతం రంగు పులుముతోంది: సీతక్క

by Prasad Jukanti |

బీసీ రిజర్వేషన్లపై బీజేపీ చేస్తున్న ఆరోపణలకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు.

Seethakka: బీసీ రిజర్వేషన్లకు బీజేపీ మతం రంగు పులుముతోంది: సీతక్క
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీసీ రిజర్వేషన్లకు (BC Reservation) బీజేపీ ఎప్పుడూ వ్యతిరేకమేనని మంత్రి సీతక్క (Seethakka) విమర్శించారు. కాంగ్రెస్ చేపట్టిన కులగణనను విమర్శించిన బీజేపీ (BJP) ఇప్పుడు దేశమంతటా కులగణన చేపట్టేందుకు సిద్ధమైందన్నారు. ఇవాళ ఓ న్యూస్ చానల్ తో మాట్లాడిన సీతక్క.. కర్ణాటకలో బీజేపీ చేసినట్లుగానే తాము రిజర్వేషన్లు చేస్తే దానికి బీజేపీ రిజర్వేషన్లకు బీజేపీ మతం రంగు పలుముతోందని మండిపడ్డారు. బీజేపీ నేతలకు అణువణువు కుల దురహంకారం ఉందని అందువల్లే ఆ పార్టీ బీసీ కులగణనను మొదటి నుంచి వ్యతిరేకిస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణనను సాధ్యమే కాదని బీజేపీ మొదట్లో వాదించిందని అయితే రాష్ట్ర ప్రభుత్వం కులగణనను విజయవంతంగా నిర్వహించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు దిశగా వెళ్తుంటే ఇప్పుడు కొర్రిలు పెట్టే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. కాగా తెలంగాణలో అమలు చేయాలని చూస్తున్న 42 శాతం రిజర్వేషన్లలో 10 శాతం ముస్లింలకు ఇస్తే బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అదే జరిగితే అసెంబ్లీ లోపల, బయటా బీజేపీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సీతక్క పై కామెంట్స్ చేశారు.

Next Story