TG Assembly: బీఆర్ఎస్ నేతలు మింగిన సొమ్మును.. ఎందుకు కక్కించడం లేదు.. ఏలేటి ఫైర్

by Ramesh Naini |

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గత ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్‌పై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

TG Assembly: బీఆర్ఎస్ నేతలు మింగిన సొమ్మును.. ఎందుకు కక్కించడం లేదు.. ఏలేటి ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో (TG Assembly) భాగంగా గత ప్రభుత్వం తెచ్చిన (Dharani Portal) ధరణి పోర్టల్‌పై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ధరణిలో కుంభకోణం అంటున్నారు.. ఇంకా ఎన్నో స్కామ్‌లు జరిగాయని (Bhatti Vikramarka) భట్టి విక్రమార్క చెప్పారు.. వాటిపై సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆదేశించడంలేదంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ధరణి పోర్టల్ వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందని విమర్శించారు. పార్ట్ బీలో ఉన్న భూమి 18 లక్షల 40 వేల ఎకరాలు.. పార్ట్ బీలో ఉన్న భూమి ఇష్యూ ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నించారు. ధరణి కుంభకోణం వెనుక ఎంత పెద్ద వాళ్ళు ఉన్న వదిలిపెట్టమని మంత్రి పొంగులేటి అన్నారని గుర్తుకు చేశారు. దేశంలోనే అతి పెద్ద భూ కుంభకోణమని, మరి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. దీని వెనుక బ్లాక్ మెయిల్ దందా ఏమైనా ఉందా అని నిలదీశారు. సెటిల్ మెంట్స్ కోసం ఆరోపణలు చేస్తున్నారా? అని ఆరోపించారు.

ఇంత వరకు ఎంత మందికి న్యాయం చేశారు?

దీనిపై సిట్ ఏమైనా వేస్తారా? అన్యాయానికి గురైన రైతుల వివరాలు ఎందుకు బయట పెట్టడం లేదని ఏలేటి ప్రశ్నించారు. ఇందులో ఇంత వరకు ఎంత మందికి న్యాయం చేశారు? అని ప్రశ్నించారు. ల్యాండ్ ట్రిబ్యునల్ ఎప్పటి వరకు ఏర్పాటుచేస్తారు? అని ప్రశ్నించారు. రైతులు తీవ్ర ఆవేదనతో ఉన్నారని, బీఆర్ఎస్ నేతలు మింగిన సొమ్మును కక్కిస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఎందుకు కక్కించడం లేదని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ దోచుకున్న సొమ్మును కక్కించి 6 గ్యారంటీలు అమలు చేస్తామని రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో చెప్పారని వివరించారు. పేదల భూములు కేసీఆర్ లాక్కున్నారని ఆరోపించారు. లాభం పొందిన గులాబీ లీడర్లు ఎవరో కాంగ్రెస్ ఇప్పటి వరకు చెప్పడం లేదన్నారు.

బడే భాయ్.. చోటే భాయ్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు

ఈ క్రమంలోనే సభలో బీజేఎల్పీ నేత మహేశ్వర రెడ్డి స్పీచ్‌ను (BRS MLAs) బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. మహేశ్వర రెడ్డి మాట్లాడుతుండగా బడే భాయ్.. చోటే భాయ్ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. దీంతో ఆగ్రహించిన ఏలేటి.. పదే పదే డిస్టర్బ్ చేస్తే ఎలా మాట్లాడాలంటూ ఏలేటి మండిపడ్డారు. సభను ఆర్డర్‌లో పెట్టాలని స్పీకర్‌ను ఏలేటి కోరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు ఆపకపోవడంతో సభను స్పీకర్ పది నిమిషాలు వాయిదా వేశారు.

Next Story