- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్ సర్కార్‌కు పడుతుంది.. బీజేఎల్పీ నేత ఏలేటి వార్నింగ్
రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే కేసీఆర్ సర్కారుకు పట్టిన గతే వీరికి పడుతుందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే కేసీఆర్ సర్కారుకు పట్టిన గతే వీరికి పడుతుందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. కామారెడ్డిలో కాంగ్రెస్ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంపు ఆఫీసుపై దాడి చేయడం కాంగ్రెస్ సర్కార్ అరాచక పాలనకు అద్దం పడుతోందన్నారు. ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎన్నికల హామీలను అమలు చేయాలని ప్రశ్నిస్తున్న బీజేపీ నేతలకు సమాధానం చెప్పడం చేతకాన్ని కాంగ్రెస్ నేతలు ఎదురుదాడికి దిగడం, రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనమన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచామని విర్రవీగుతున్న కాంగ్రెస్ సర్కారుకు దమ్ముంటే మండల, జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు నిర్వహించాలని సవాల్ విసిరారు. నేడు జరిగే మంత్రి వర్గ సమావేశంలో ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఖరీఫ్ సీజనుకు ఇవ్వాల్సిన రైతు భరోసా డబ్బులు జమ చేయాలని, గతంలో ఇవ్వకుండా ఉన్న పెండింగులో ఉన్న బకాయిలను కూడా చెల్లించాలి. ప్రతి కేబినెట్‌సమావేశంలో బడా కాంట్రాక్టర్లకు చెల్లించే బిల్లులు, వాటి కమిషన్లలో వాటాలు, పంపకాల గురించి తప్ప ప్రజా సమస్యలను పరిష్కరించడంపై చర్చించకపోవడం దుర్మార్గమన్నారు.
రిజర్వ్ బ్యాంకు నుంచి రూ.9 వేల కోట్ల అప్పు
ఈ నెల 10వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకు నుంచి రూ.9 వేల కోట్ల అప్పు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోందని అన్నారు. ఆ డబ్బు రైతు భరోసా కోసమే అని అన్నదాతలు భావించారని, కానీ డబ్బులు వచ్చి పది రోజులు దాటిన రైతు భరోసా చెల్లించకపోవడంతో ఈ డబ్బులను కూడా బడా కాంట్రాక్టర్లకే బిల్లుల చెల్లించడంలో భాగంగా ఇచ్చారనే అనుమానం కలుగుతోందన్నారు. ఇటీవల క్యాబినెట్ మంత్రులంతా ఢిల్లీకి వెళ్లినపుడు కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ పొటెన్షియల్ స్టేట్, ఫండింగ్ చేయాలని కోరినట్టు తెలిసింది. అందుకే కాంగ్రెస్ హైకమాండ్‌కు కప్పం కట్టేందుకు రిజర్వ్ బ్యాంకు నుంచి తాజాగా అప్పు తీసుకున్న తొమ్మిది వేల కోట్లను కాంట్రాక్టర్లకు చెల్లించి, వారిచ్చే కమిషన్లను హైకమాండ్‌కు పంపుతున్నట్టుగా ఉందన్నారు. రాష్ట్రం ఆర్ధిక సంక్షభంలో కూరుకుపోతుందని కాగ్ వంటి సంస్ధలు, ఆర్ధిక నిపుణులు హెచ్చరించిన రేవంత్ సర్కార్ బారెడంత అప్పులు చేస్తోందని, బెత్తెడంత అభివృద్ధి, సంక్షేమం చేయకపోవడం దారుణం అని మండిపడ్డారు.






