మంత్రి శ్రీధర్ బాబుపై BJLP నేత ఏలేటి సీరియస్

by Gantepaka Srikanth |

మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu)పై తెలంగాణ బీజేపీ(Telangana BJP) కీలక నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) తీవ్ర విమర్శలు చేశారు.

మంత్రి శ్రీధర్ బాబుపై BJLP నేత ఏలేటి సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu)పై తెలంగాణ బీజేపీ(Telangana BJP) కీలక నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అప్పు చేయలేని శ్రీధర్ బాబు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఇకనైనా శ్రీధర్ బాబు ప్రజలను తప్పుదోవ పట్టించే పనులు మానుకోవాలని హితవు పలికారు. రుణం కోసం రూ.170 కోట్ల కమీషన్ ఇచ్చారని.. ప్రజాధనాన్ని కమీషన్‌గా ఎలా ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందని విమర్శించారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ ఘన విజయం సాధించడం ఖాయమని అన్నారు.

రైతులు, నిరుద్యోగులు, మహిళలు ఇలా అందరూ కాంగ్రెస్ పాలనలో ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన చెందారు. అంతేకాదు.. హెచ్‌సీయూ భూముల(HCU Lands) వ్యవహారంలో కేటీఆర్(KTR) హస్తం ఉన్నట్లు తమకు అనుమానంగా ఉందని ఆరోపించారు. హెచ్‌సీయూ భూములు అమ్ముకుంటున్న సీఎం రేవంత్ రెడ్డికి సహకరిస్తున్న బీజేపీ ఎంపీ ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ ఎంపీ పేరు బయటపెట్టే దమ్ము లేనప్పుడు పదే పదే మీడియా ముందు గగ్గోలు పెట్టడమైనా ఆపేయాలని సూచించారు.

Next Story