- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MLA Birthday: ఖండాంతరాలు దాటిన అభిమానం
by Gantepaka Srikanth |
తమ నాయకుడిపై ఉన్న అభిమానాన్ని కాంగ్రెస్ లీడర్లు మరోసారి చాటుకున్నారు.

X
దిశ, కొడిమ్యాల: తమ నాయకుడిపై ఉన్న అభిమానాన్ని కాంగ్రెస్ లీడర్లు మరోసారి చాటుకున్నారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పుట్టినరోజు సందర్భంగా మండలానికి చెందిన మల్యాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం జీవన్ రెడ్డి, బైరిశెట్టి సంపత్, సింగిరెడ్డి వినోద్ రెడ్డిలు స్థానికంగా పలు సేవా కార్యక్రమాలు చేశారు. అంతేగాకుండా వినూత్న రీతిలో తమ నాయకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలనుకున్నారు. అందుకోసం అమెరికా న్యూయార్క్ నగరంలోని టైం స్క్వేర్ బిల్డింగ్‌పై శుభాకాంక్షలు తెలుపుతూ తమ నాయకుడిపై ఉన్న ఇష్టాన్ని తెలియజేశారు. వారితోపాటు అమెరికాలోని చొప్పదండికి నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ ఎన్నారైలు కూడా ఎమ్మెల్యేకు బర్త్డే విషెస్ తెలియజేశారు.
Next Story






