- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KTR : జేసిబీలు, బుల్డోజర్లు చూసి పక్షులు సహాయం కోరుతున్నాయి : కేటీఆర్
హైదరాబాద్(Hyderabad) లోని హెచ్సీయూ భూముల వివాదం(HCU Land Issue)పై బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్(KTR) స్పందించారు.

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) లోని హెచ్సీయూ భూముల వివాదం(HCU Land Issue)పై బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్(KTR) స్పందించారు. ఈ వివాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఇకనైనా నోరువిప్పాలని డిమాండ్ చేశారు. పశ్చిమ నగరానికి ఊపిరితిత్తుల వంటి 400 ఎకరాల జీవవైవిధ్యం గల స్థలాన్ని నాశనం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) గ్రీన్ మర్డర్ కు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఆ స్థలంలో తిరుగుతున్న జేసీబీలు, బుల్డోజర్లను చూసి అక్కడి నెమళ్లు(Peacocks), పక్షులు(Birds) సహాయం కోసం ఆర్థిస్తున్నాయని తెలిపారు. ఇప్పటికైనా రాహుల్ గాంధీ స్పందించి ఈ వినాశనాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. ఇవన్నీ చూస్తూ కూడా స్పందించకపోతే ఎలా అని కాంగ్రెస్ అధిష్టానాన్ని ఆయన ప్రశ్నించారు.
ఈ మేరకు కేటీఆర్ తన ఎక్స్ ఖాతా వేదికగా పోస్ట్ చేశారు. అయితే హెచ్సీయూ భూముల్లో జేసీబీలు, బుల్డోజర్ పనులు జరుగుతుండగా అనేక పక్షులు, నెమళ్లు విపరీతంగా అరుస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు రెవెన్యూ రికార్డుల ప్రకారం ఆ భూములు ప్రభుత్వానివే అని సర్కార్ వాదిస్తోంది.






