తెలంగాణ అసెంబ్లీ భవనంలో బిహార్ యువకులు

by Gantepaka Srikanth |

బిహార్ రాష్ట్రానికి చెందిన యువకులు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.

తెలంగాణ అసెంబ్లీ భవనంలో బిహార్ యువకులు
X

దిశ, వెబ్‌డెస్క్: బిహార్ రాష్ట్రానికి చెందిన యువకులు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutta Sukhender Reddy)ని మర్యాద పూర్వకంగా కలిశారు. తెలంగాణ శాసనసభ మరియు శాసనమండలి సమావేశ మందిరాలను వారు శనివారం సందర్శించారు. అనంతరం తెలంగాణ శాసనమండలి చైర్మన్‌తో గ్రూప్ ఫొటో దిగారు. ఈనెల 3 తేదీ నుండి 7వ తేదీ వరకు మేర యువ భారత్, రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో "ఇంటర్ స్టేట్ యూత్ ఎక్చేంజ్" ప్రోగ్రాం జరిగింది. తదనంతరం వారు తెలంగాణ లేజిస్లేచర్ సందర్శనకు వచ్చారు.

బిహార్ యువతతో మాట - ముచ్చట సందర్భంగా తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ "యువతనే దేశానికి వెన్నెముక అన్నారు. యువత తమ కర్తవ్యాన్ని బాధ్యతాయుతంగా నిర్వహిస్తే, దేశాభివృద్ధి జరుగుతుందన్నారు. చేడు మార్గంలో యువత నడవకుండా, చేడు అలవాట్లకు దూరంగా ఉండలన్నారు. దేశ సేవయే యువత యొక్క నిజమైన కర్తవ్యం అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నట్లు ఆయన తెలిపారు. మరింత బలమైన, ఐక్యమైన మరియు అభివృద్ధి చెందిన భారతదేశం కోసం మనమందరం కృషి చేయాలని ఆయన చెప్పారు. ప్రపంచంలో ఏ దేశానికి లేని యువ సంపద మన భారతదేశానికీ ఉందని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ శాసన మండలి సెక్రెటరీ నరసింహాచార్యులు, శాసనమండలి ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story