- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పై బిగ్ అప్‌డెట్
ఈ నెల 7న చంద్ర గ్రహనం ఉండటంతో ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనంపై నెలకొన్న సందేహాలపై ఉత్సవ సమితి కిలక ఆప్ డేట్ ఇచ్చింది.

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు (Vinayaka Navratri celebrations) అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ముంబైని తలపించేలా హైదరాబాద్ నగరంలోని ప్రతి వీధిలో వినాయక మండపాలు (Vinayaka Mandapalas) ఏర్పాటు చేసి, చిన్నా పెద్ద తేడా లేకుండా సంబరాలు చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి అంటే గుర్తొచ్చింది ఖైరతాబాద్ మహా గణపతి. ఈ సంవత్సరం విశ్వశాంతి మహా గణపతిగా ఖైరతాబాద్ మహా గణపతి (Khairatabad Maha Ganapati) భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఈ విగ్రహం తయారీ మొదలైనప్పటి నుంచి భక్తుల తాకిడి భారీగా ఉండటంతో.. ఈ సంవత్సరం పోలీసులు, ఉత్సవ సమితీ కలిసి భారీ ఏర్పాట్లు చేశారు.
ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు వస్తున్నారు. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 7న చంద్ర గ్రహణం (lunar eclipse) వస్తుండటంతో వినాయక నిమజ్జనాలపై అనేక సందేహాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే లక్షలాది మంది వచ్చే ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం (Immersion of Maha Ganapati) ఎప్పుడు చేస్తారనే సందేహాలు భక్తులు, నగర ప్రజల్లో మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ ఉత్సవ సమితి సెప్టెంబర్ 6న ఖైరతాబాద్ విశ్వశాంతి మహా గణపతి నిమజ్జనం చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.






