ఫార్ములా ఈ-రేసు కేసులో బిగ్ అప్‌డేట్... అరవింద్ కుమార్‌పై చర్యలకు DoPTకి సీఎస్ లేఖ

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-03 03:55:27  IST  )

తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫార్ములా ఈ-రేసు ఆర్థిక అవకతవకల కేసుకు సంబంధించి మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

ఫార్ములా ఈ-రేసు కేసులో బిగ్ అప్‌డేట్... అరవింద్ కుమార్‌పై చర్యలకు DoPTకి సీఎస్ లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫార్ములా ఈ-రేసు (Formule E-Race) ఆర్థిక అవకతవకల కేసుకు సంబంధించి మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ (Aravind Kumar)ను విచారించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ రావు (CS Rama Krishna Rao) ఇవాళ కేంద్ర ప్రభుత్వ సిబ్బంది, శిక్షణా శాఖ (DoPT)కి లేఖ రాశారు. అక్కడి నుంచి అనుమతి రాగానే ఏసీబీ ఆయనపై చార్జ్‌షీటు దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. 2023లో హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా ఈ-కార్ రేసు నిర్వహణకు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా రూ.55 కోట్ల నిధులు విదేశీ సంస్థకు విడుదల చేయడంపై అవినీతి నిరోధక శాఖ (ACB) కేసు నమోదు చేసింది.

కాగా, ఇదే కేసులో A1గా మాజీ మంత్రి కేటీఆర్, A2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిగా ఉన్నారు. అయితే, గతంలో హెచ్‌ఎండీఏ (HMDA) కమిషనర్‌గా పనిచేసిన అరవింద్ కుమార్ కేబినెట్, ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా, ఎన్నికల కోడ్ అమలుల్లో ఉండగా నిధులను మళ్ళించడంలో కీలక పాత్ర పోషించారని ఏసీబీ ఆరోపిస్తోంది. దేశంలో ఐఏఎస్ అధికారులపై కేసు విచారణ, అభియోగాలు నమోదు చేసేందుకు ముందుగా కేంద్రంలోని DoPT నుంచి ప్రాసిక్యూషన్ అనుమతి తప్పనిసరి కావడంతో సీఎస్ రామకృష్ణా రావు తాజాగా లేఖ రాయడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.

Next Story