ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై BIG అప్ డేట్.. మంత్రి పొంగులేటి కీలక విషయాలు

by Prasad Jukanti |   (  Updated:2026-04-18 12:57:28  IST  )

తెలంగాణలో భూముల విలువలను సవరించబోతున్నామని, మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై BIG అప్ డేట్.. మంత్రి పొంగులేటి కీలక విషయాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు త్వరలోనే నోటిఫికేషన్ రాబోతోందని ప్రచారం జరుగుతున్న వేళ ఈ ఎన్నికల నిర్వహణపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక అప్ డేట్ ఇచ్చారు. ఈ వేసవి కాలం ముగిశాకే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగవచ్చని అన్నారు. ఇవాళ మీడియాతో చిట్‍చాట్ నిర్వహించిన ఆయన.. పలు కీలక అంశాలపై స్పందిస్తూ ఎన్నికలు ఈ సమ్మర్ అయ్యాకే నిర్వహించబోతున్నట్లు స్పష్టం చేశారు. కేబినెట్ విస్తరణపై చర్చ ఉందని విడతల వారీగా జరుగుతుందన్నారు. మంత్రివర్గ విస్తరణలో పలువురు మంత్రుల శాఖల్లో మార్పులు ఉండబోతున్నాయని జరుగుతున్న ప్రచారంపై సైతం ఆయన స్పందించారు. ఏ శాఖ ఎవరికి శాశ్వతం కాదని అయితే శాఖలపై ఆశలు పెట్టుకోవడం సహజం అన్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ సైతం త్వరలోనే ఉండబోతుందని తెలిపారు.

త్వరలో భూముల విలువ పెంపు:

తెలంగాణలో త్వరలోనే భూముల విలువ పెరగనుందని ఈ మేరకు కసరత్తు జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ల్యాండ్ వ్యాల్యూ పెంచలేదన్నారు. ధరణి సమస్యలు భూ-భారతితో పరిష్కారం అవుతాయని చెప్పారు. భూముల రిజిస్ట్రేషన్ మ్యాప్‍తో ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయని తెలిపారు. మ్యాప్‍తో కూడిన ఫస్ట్ రిజిస్ట్రేషన్ పాలేరు‍లో జరుగుతుందని రెవెన్యూ‍లో కొత్త పాలసీ తీసుకురాబోతున్నామని ఇందుకు సంబంధించి కసరత్తు జరుగుతుందన్నారు. అసైన్డ్ భూములపై ఎక్కువ కంప్లైంట్స్ ఉన్నాయి వాటిని త్వరలో పరిష్కరిస్తామని వెల్లడించారు. నాలుగు రకాల కంప్లైంట్స్ ను పరిష్కరించేందుకు అధికారులను ఇప్పటికే ఆదేశించామన్నారు.

త్వరలోనే బీఆర్ఎస్ బాగోతం బయటకు:

అసెంబ్లీలో నాపై ప్రతిపక్షం దాడి చేసినప్పుడు మంత్రులు మద్దతుగా నిలిచారని మంత్రి పొంగులేటి అన్నారు. ప్రతిపక్షం ట్రాప్‍లో నేను పడనని అందుకే ఎంత విమర్శించినా ఓపికగా ఉండి సమాధానం చెప్పాన్నారు. BRS అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమ పనుల లిస్ట్ తయారవుతోందని సరైన సమయంలో అన్నీ బయటకు వస్తాయని హెచ్చరించారు.

Next Story