- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్వేచ్ఛ సూసైడ్ కేసులో బిగ్ ట్విస్ట్.. పూర్ణ భార్య సంచలన వీడియో విడుదల
ప్రముఖ టీవీ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ సూసైడ్ కేసులో నిందితుడు పూర్ణచందర్ (Poornachandar)పై పోక్సో (Pocso) కేసు నమోదైన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ టీవీ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ సూసైడ్ కేసులో నిందితుడు పూర్ణచందర్ (Poornachandar)పై పోక్సో (Pocso) కేసు నమోదైన విషయం తెలిసిందే. స్వేచ్ఛ కూతురు ఫిర్యాదుతో చిక్కడపల్లి (Chikkadapally) పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. శుక్రవారం స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి కనిపించకుండా పోయిన పూర్ణచందర్ శనివారం అర్ధరాత్రి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. స్వేచ్ఛ మరణంతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ ఓ లేఖను కూడా విడుదల చేశాడు. ఈ నేపథ్యంలో కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
స్వేచ్ఛ ఆత్మహత్యపై మీడియాకు పూర్ణచందర్ భార్య స్వప్న ఇవాళ ఓ సంచలన వీడియోను విడుదల చేసింది. అందులో ఆమె మాట్లాడుతూ.. స్వేచ్ఛ కూతురు తన భర్త మీద వేస్తున్న నిందలు చూసి తట్టుకోలేకపోతున్నానని పేర్కొంది. ఆమెను పూర్ణచందర్ సొంత బిడ్డలా.. కంటిరెప్పలా చూసుకున్నాడని తెలిపింది. స్వేచ్ఛ తనను కూడా చాలా టార్చర్ పెట్టిందంటూ సంచలన ఆరోపణలు చేసింది. తనకు, భర్త పూర్ణకు పదే.. పదే ఫోన్ కాల్స్ చేసి సతాయించేదని పేర్కొంది. ఈ క్లిష్ట సమయంలో స్వేచ్ఛ కూతురికి తన భర్తపై నిందలు వేయమని ఎవరు చెబుతున్నారనో తనకు తెలియదని.. పూర్ణచందర్ మాత్రం అంత చెడ్డవాడు కాదని తెలిపింది. తమకు న్యాయస్థానాలపై పూర్తి నమ్మకం ఉందని స్వప్న వీడియోలో చెప్పుకొచ్చింది.






