- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తూచ్.. ట్రైన్‌లో నాపై ఎవరూ అత్యాచారయత్నం చేయలే.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన యువతి
ఎంఎంటీఎస్ ట్రైన్‌లో యువతిపై లైంగికదాడి యత్నం ఘటన ఫేక్ అని రైల్వే పోలీసులు నిర్ధారించారు.

ఎంఎంటీఎస్ ట్రైన్‌లో యువతిపై లైంగికదాడి యత్నం ఘటన ఫేక్ అని రైల్వే పోలీసులు నిర్ధారించారు. సికింద్రాబాద్ -మేడ్చల్ ఎంఎంటీఎస్ ట్రైన్‌లో మార్చి 23న ఓ యువతి పట్టాలపై పడి ఉండడంతో ఆమెను 108 అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. వాంగ్మూలంలో తనపై ఆగంతకుడు లైంగికదాడికి యత్నించడంతో తప్పించుకోవటం కోసం నడుస్తున్న రైల్లోంచి దూకేశానని యువతి తెలపడంతో రైల్వే పోలీసులు ఆ దిశగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. అయితే పోలీసుల విచారణలో షాకింగ్ నిజం బయటపడింది. తనపై ఎవరూ అత్యాచారయత్నం చేయలేదని యువతి ట్విస్ట్ ఇచ్చింది. ఆమె ఆ రోజు ఎందుకు అబద్దం చెప్పిందో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చెందాలని జపాన్ పారిశ్రామిక, వ్యాపారవేత్తలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆహ్వానం పలికారు. టోక్యోలోని హోటల్ ఇంపీరియల్‌లో జరిగిన ఇండియా-జపాన్ ఎకనామిక్ పార్టనర్‌షిప్ రోడ్‌షోలో రాష్ట్ర అధికారిక బృందం రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించింది. వివిధ రంగాలకు చెందిన దాదాపు 150 మందికి పైగా జపాన్ పారిశ్రామికవేత్తలు పాల్గొన్న ఈ రోడ్ షోలో ముఖ్యమంత్రి మాట్లాడారు. జపాన్‌ను ఉదయించే సూర్యుడి దేశం అని పిలుస్తారు. మా ప్రభుత్వ నినాదం ‘తెలంగాణ రైజింగ్’. ఈ రోజు తెలంగాణ జపాన్‌లో ఉదయిస్తోంది అని పేర్కొన్నారు. ఈ రోడ్ షోలో సీఎం ఇంకా ఏమన్నారో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
దేశానికి ఆదర్శంగా నిలిచేలా సమగ్ర బెట్టింగ్ వ్యతిరేక విధానం రూపకల్పనపై కృషి చేస్తున్నామని మంత్రి నారా లోకేశ్తెలిపారు. పవిత్రమైన వెంకటేశ్వర స్వామి పేరుతో గోవిందా అనే బెట్టింగ్ యాప్ ని కొన్నేళ్లుగా పేరు మోసిన సినీ తారలు నడుపుతున్నారని ప్రముఖ యూట్యూబర్ నా అన్వేష్ ఆరోపించారు. దీనిపై మంత్రి లోకేశ్ ఇవాళ ట్విట్టర్ వేదికగా స్పందించారు. దేశానికే ఆదర్శంగా నిలిచేలా సమగ్ర బెట్టింగ్ వ్యతిరేక విధానాన్ని రూపొందించేందుకు కృషి చేస్తున్నామని లోకేశ్ తెలిపారు. ఇంకా లోకేష్ ఏమన్నారో ఈ లింక్ క్లిక్ చేయండి.
తమ హక్కుల కోసం పురుషులు ఆందోళన బాట పట్టారు. మహిళలతో పాటు పురుషులకు సమాన హక్కులు కావాలంటూ దీక్షబూనారు. మగవారి హక్కుల కోసం పోరాటం చేస్తున్న కార్యకర్తలు ఇవాళ విశాఖ నుంచి రైలులో ఢిల్లీ బయల్దేరి వెళ్లారు వెళ్లారు. రేపు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వారు నిరసన ప్రదర్శన చేయనున్నారు. స్త్రీల మాదిరి గానే మగవారి కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలనేది తమ లక్ష్యమని వారు చెబుతున్నారు. పురుషుల ప్రధాన డిమాండ్లు ఏంటో ఈ లింక్‌లో చూడండి.






