నిమ్స్ అగ్ని ప్రమాదంలో బిగ్ ట్విస్ట్..!

by velandi.Saikiran |   (  Updated:2025-04-19 15:26:01  IST  )

నిమ్స్ అగ్ని ప్రమాదంలో ( Nimes fire ACCIDENT) బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. తెరపైకి కొత్త అంశాలు వస్తున్నాయి. హైదరాబాద్‌

నిమ్స్ అగ్ని ప్రమాదంలో బిగ్ ట్విస్ట్..!
X

దిశ, వెబ్ డెస్క్: నిమ్స్ అగ్ని ప్రమాదంలో ( Nimes fire ACCIDENT) బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. తెరపైకి కొత్త అంశాలు వస్తున్నాయి. హైదరాబాద్‌ లోని (Hyderabad) నిమ్స్‌ ఎమర్జెన్సీ విభాగంలో ( NIMS Emergency Department) అగ్నిప్రమాదం ( Fire Accident) జరిగింది. ఆస్పత్రి ఐదో అంతస్తులో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఇవాళ సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగిన బ్లాక్ లోనే భారీగా టపాసులు గుర్తించారు. దింతో టపాసులకు నిప్పు అంటుకుంటే పరిస్థితి ఏంటి ? అని అధికారులు సీరియస్ అయినట్లు తెలుస్తోంది.

ఎమర్జెన్సీ బ్లాక్ లో క్రాకర్స్ ఎందుకు ఉన్నాయి? రోగులకు వైద్యం అందించే చోట టపాసులు పెట్టిందెవరు? అనే కోణంలో విచారణ చేస్తున్నారు. మంటలను ఆర్పే క్రమంలో టపాసులను గుర్తించింది సిబ్బంది. నిమ్స్ సిబ్బంది నిర్లక్ష్యం పై ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక నిమ్స్ ఆసుపత్రి అగ్నిప్రమాదం పైన తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పందించారు. ఈ ప్రమాద సంఘటనలో.. రోగులకు ఎలాంటి హాని జరగలేదని వివరించారు. ఆస్తి నష్టం పెద్దగా జరగలేదని కూడా పేర్కొన్నారు. వేసవికాలం అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు. ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని... పేర్కొన్నారు మంత్రి దామోదర రాజనర్సింహ.

Next Story