- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MLC election: ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. రేసులో స్వతంత్ర అభ్యర్థి?
బీఆర్ఎస్ రెండో అభ్యర్థి విషయంలో అనూహ్య అంశం తెరపైకి వస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు (MLC Election) ఆసక్తిని రేపుతున్నాయి. ఖాళీ కాబోతున్న ఐదు స్థానాల భర్తీ కోసం అభ్యర్థుల నుంచి నామినేషన్లకు ఇంకా ఒక రోజు మాత్రమే గడువు మిగిలి ఉండగా ఇప్పటివరకు పార్టీలు అభ్యర్థులను ప్రకటించలేదు. ఎమ్మెల్యేల సంఖ్య బలాబలాల నేపథ్యంలో నాలుగు స్థానాలు కాంగ్రెస్(Congress), ఒక స్థానం బీఆర్ఎస్ (BRS) దక్కించుకోబోతున్నాయి. అయితే కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేలా బీఆర్ఎస్ రెండో అభ్యర్థిని బరిలోకి దింపబోతున్నదని, అయితే అభ్యర్థి విషయంలో కేసీఆర్ (KCR) తీవ్ర కసరత్తు చేస్తున్నారన్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ రేస్‌లో అనూహ్యంగా స్వతంత్ర అభ్యర్థి (Independent Candidate) అంశం తెరపైకి రావడం హాట్‌టాపిక్ అయింది.
మరో నలుగురు వస్తే చాన్స్..
ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవాలంటే 21 ఎమ్మెల్యేలు అవసరం. ఈ లెక్కన మరో నలుగురు ఎమ్మెల్యేలు తమ వైపు నిలిస్తే రెండో అభ్యర్థిని సైతం గెలిపించుకోవచ్చనే చర్చ గులాబీ పార్టీలో జరుగుతోంది. పార్టీకి చెందిన నేతను బరిలోగి దింపిదే పార్టీ మారిన ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల ఎమ్మెల్యేల మద్దతు సాధ్యం కాకపోవచ్చనే ఆలోచనతో గులాబీ బాస్ లెక్కలు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో రెండో అభ్యర్థిగా అవకాశం కోసం స్వతంత్ర అభ్యర్థిగా అడపా సురేందర్ (Adapa Surender) ప్రయత్నాలు చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన సురేందర్ తెలంగాణ ఉద్యమంలోనూ పని చేశారు. ఇప్పటికే ఆయన కేసీఆర్‌ను కలిసి కాంగ్రెసేతర (Non Congress) అభ్యర్థిగా పోటీ చేసేందుకు మద్దతును అభ్యర్థించినట్లు తెలుస్తోంది. నిజానికి బీజేపీ ఓటింగ్‌కు దూరం ఉండాలని డిసైడ్ అయినా అలా చేస్తే కాంగ్రెస్ 4వ అభ్యర్థిని గెలిపించుకునే అవకాశం ఇచ్చినట్లు అవుతున్నందున స్వతంత్ర అభ్యర్థికి సపోర్ట్ చేసే అవకాశం ఉండటంతో సురేందర్ కమలం పార్టీ నేతలను సైతం తనకు మద్దతు ఇస్తారన్న అంచనాకు వచ్చారని తెలుస్తోంది. ఇదే సమయంలో ఒక వేళ ఎంఐఎంకు కాంగ్రెస్ సీటు ఇవ్వకపోతే వారి మద్దతు కూడా పొందవచ్చనే నమ్మకంతో కేసీఆర్‌ను ఒప్పించేందుకు సురేందర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అభ్యర్థులపై ఉత్కంఠ..
అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్టీల కసరత్తు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ఇవాళ సాయంత్రం వరకు అభ్యర్థులను ప్రకటించవచ్చని తెలుస్తోంది. తీవ్రమైన పోటీ నేపథ్యంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నది అనేది ఆసక్తిగా మారింది. పొత్తులో భాగంగా సీపీఐకి అవకాశం ఇస్తుందా? ఎంఐఎం సిట్టింగ్ స్థానానికి సపోర్టు చేస్తుందా? అనేది తేలాల్సి ఉంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం ఇవాళ తమ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. కేసీఆర్ ఇద్దరు అభ్యర్థులను ప్రకటిస్తారా లేక అధికారపక్షానికి టెన్షన్ పెట్టేందుకు స్వతంత్ర అభ్యర్థి అంశాన్ని రేస్‌లోకి తీసుకు వస్తారా? అనేది వేచి చూడాలి.






