- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Hyderabad Traffic : హైదరాబాద్ వాసులకు బిగ్ ట్రాఫిక్ అలర్ట్ !
సంక్రాంతి పండుగ వేళ హైదరాబాద్ నగర వాసుల(Hyderabad City Residents)కు పోలీస్ శాఖ(Police Department) బిగ్ షాక్ ఇచ్చింది.

దిశ, వెబ్ డెస్క్ : సంక్రాంతి పండుగ వేళ హైదరాబాద్ నగర వాసుల(Hyderabad City Residents)కు పోలీస్ శాఖ(Police Department) బిగ్ షాక్ ఇచ్చింది. పరేడ్ గ్రౌండ్స్(Parade Grounds)లో అంతర్జాతీయ కైట్ & స్వీట్ ఫెస్టివల్(International Kite & Sweet Festival) సందర్భంగా సికింద్రాబాద్ వద్ద(At Secunderabad) 13 నుంచి 15వ తేదీ(3Days) వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు(Traffic Restrictions Enforced)చేస్తున్నారు.
రోటరీ ఎక్స్ రోడ్ నుంచి ఎస్‌బీహెచ్‌కు వెళ్లే దారి.. వైఎంసీఏ నుంచి క్లాక్ టవర్‌కు మళ్లింపు చేస్తారు. రసూల్‌పురా నుంచి ప్లాజాకు వెళ్లే దారి.. సీటీవో ఎక్స్ రోడ్స్ నుంచి బలంరాయికి మళ్లించారు. పికెట్ నుంచి ఎస్ బీహెచ్ & టివోలికి వెళ్లే మార్గం.. స్వీకార్ ఉపకర్ వద్ద వైఎంసీఏకు మళ్లింంచారు.
ఎన్ సీసీ నుంచి ప్లాజాకు వెళ్లే మార్గం.. టీవోలి వద్ద నుంచి బ్రూక్‌బాండ్‌కు మళ్లించారు. ఈ ఆంక్షల్ని దృష్టిలో పెట్టుకొని.. ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేరాలన్న ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ కైట్ & స్వీట్ ఫెస్టివల్ కు హాజరయ్యేందుకు గేట్ నం.1 నుంచి పబ్లిక్ ఎంట్రీకి అనుమతించారు. ఐదు ప్రాంతాల్లో పార్కింగ్‌కి వెసులుబాటు కల్పించినట్లుగా తెలిపారు.






