- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్రేటర్ వరంగల్, కరీంనగర్ వాసుల ఆశలపై నీళ్లు
స్మాట్ సిటీగా రూపుదిద్దుకుంటుందన్న అక్కడి ప్రజల ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. రాష్ట్రంలో గ్రేటర్ వరంగల్, కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్లు\

దిశ, తెలంగాణ బ్యూరో: స్మాట్ సిటీగా రూపుదిద్దుకుంటుందన్న అక్కడి ప్రజల ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. రాష్ట్రంలో గ్రేటర్ వరంగల్, కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్లు స్మార్ట్ సిటీ మిషన్ లో ఎంపిక చేసినట్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జోరుగా ప్రచారం జరిగింది. స్మార్ట్ సిటీ ద్వారా జరిగే అభివృద్ధి, కలిగే అవకాశాలపై అక్కడి ప్రజలు పెట్టుకున్న ఆశలు కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో ఆ ఆశలు అడుగంటాయి. ఈ రెండు పట్టణాల్లో అనేక మౌళిక సదుపాయాలు కల్పిస్తారని, పూర్తి స్థాయిలో అభివృద్ధి జరుగుతుందని ఆయా మున్సిపల్ కార్పోరేషన్ల పరిధిలోని ప్రజలు, నాయకులు, సమీప ప్రాంత వాసులు ఆశిస్తూవచ్చారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం గ్రేటర్ వరంగల్, కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్లు స్మార్ట్ సిటీ మిషన్ పరిధిలో లేవని స్పష్టం చేసింది.
గురువారం జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో వరంగల్ ఎంపీ డాక్టరు కడియం కావ్య లోక్ సభలో మాట్లాడుతూ.. 2026 జూన్ లోగా గ్రేటర్ వరంగల్, కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్లలను స్మార్ట్ సిటీ మిషన్‌లో చేర్చాలని తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థించిందా? ఈ నగరాల్లో అమలవుతున్న మౌలిక వసతుల అభివృద్ధి పనులు, వాటిలో పూర్తైనవి, ప్రగతిలో ఉన్నవి, వ్యయ వివరాలు తదితర అంశాలపై సమాచారం తెలియజేయాలని కోరారు. ఎంపీ కావ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి టోఖన్ సాహూ సమాధానం వెల్లడించారు. గ్రేటర్ వరంగల్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లలో స్మార్ట్ సిటీ మిషన్ (ఎస్‌సీఎం)కొనసాగించే అవకాశాలు లేవని మంత్రి స్పష్టం చేశారు. 2025 మార్చి 31తో ఈ మిషన్ ముగిసిందని వెల్లడించారు. ఇప్పటికే మిషన్ ముగిసినందున కొత్త నగరాలను చేర్చే అవకాశమే లేదన్నారు. అలాగే, మిగిలిన నగరాల్లో ప్రాజెక్టుల పూర్తి కోసం సమయాన్ని పొడిగించే అంశం ప్రస్తుతం పరిశీలనలో కూడా లేదని పేర్కొన్నారు.






