- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్.. వికాస్ సహా 15 మంది సరెండర్
మావోయిస్టుల వరుస లొంగుబాట్లు కంటిన్యూ అవుతున్నాయి. వికాష్‌తో పాటు 15 మంది మావోలు పోలీసుల ఎదుట లొంగిపోయారు.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో మావోయిస్టులు లేకుండా నిర్మిలించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ కగారు గడవు ముంచుకు వస్తున్న వేళ మావోయిస్టుల వరుస లొంగుబాట్లు కొనసాగుతున్నాయి. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్ జిల్లాలో శనివారం రాత్రి బలంగిర్-బర్‌గఢ్-మహాసముంద్ (బిబిఎం) డివిజన్‌కు చెందిన కీలక మావోయిస్టు నేతలు పోలీసుల ముందు లొంగిపోయారు. స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు ముప్పిడి సాంబయ్య అలియాస్ వికాస్‍తో పాటు మరో 14 మంది సరెండర్ అయ్యారు. వీరి లొంగుబాటుపై పోలీసులు ఇవాళ మధ్యాహ్నం అధికారిక ప్రకటన చేయనున్నట్లు హిందుస్తాన్ టైమ్స్ వెబ్ సైట్ పేర్కొంది.
సరెండర్ అయింది వీరే:
వికాస్ (స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు), దినేష్ (ప్లాటూన్ సభ్యురాలు), కవిత (ప్లాటూన్ సభ్యురాలు), సవిత (ప్లాటూన్ సభ్యురాలు), మంగేష్ (డివిజనల్ కమిటీ సభ్యుడు - బీబీఎం), రింకు (ఏరియా కమిటీ సభ్యుడు), జుగ్ను (ప్లాటూన్ సభ్యుడు), అస్మిత (ఏరియా కమిటీ సభ్యురాలు), సస్మిత (ఏరియా కమిటీ సభ్యురాలు), సాస్మిత (ఏరియా కమిటీ సభ్యురాలు), కేడర్‌లుగా పోలీసులు గుర్తించారు. (ఏరియా కమిటీ సభ్యురాలు), రీటా (ఏరియా కమిటీ సభ్యురాలు), నీల (ఏరియా కమిటీ సభ్యురాలు), మీనా (ప్లాటూన్ సభ్యురాలు) మరియు బేబీ (డివిజనల్ కమిటీ మెంబర్ – బీబీఎం) ఉన్నారు. లొంగిపోయిన వారిలో ఒకరు స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు (SZCM), ఇద్దరు బలంగీర్-బర్‌గఢ్-మహాసముంద్ (BBM) డివిజన్‌కు చెందిన డివిజనల్ కమిటీ సభ్యులు (DVCMలు), ఐదుగురు ఏరియా కమిటీ సభ్యులు (ACMలు), మరియు ఏడుగురు ప్లాటూన్ సభ్యులు (PMలు) అని అధికారులు తెలిపారు.
జర్నలిస్టుతో సంప్రదింపులు:
లొంగిపోయిన మావోయిస్టులు AK-47 రైఫిళ్లు, రెండు SLRలు, మూడు .303 రైఫిళ్లు, మూడు 12-బోర్ గన్లు, రెండు INSAS రైఫిళ్లు మరియు ఒక 14 మస్కెట్ (మ్యాగజైన్ లేని .303 రైఫిల్)లు పోలీసులకు అందజేశారు. అయితే స్థానిక జర్నలిస్ట్ ఒకరు వీరి లొంగుబాటుకు తొలి సంప్రదింపులకు సహకరించారని ఆ తర్వాత రాష్ట్ర నిఘా విభాగాలు సమన్వయం చేసుకున్నాయని ఓ పోలీసు అధికారి వెల్లడించినట్లు ఈ కథనం పేర్కొంది.






