BREAKING: మదర్ డెయిరీ డైరెక్టర్ల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బిగ్‌షాక్

by Naga Rani Yarlagadda |

మదర్ డెయిరీ డైరెక్టర్ల ఎన్నికల్లో (Mother Dairy Elections) కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలింది.

BREAKING: మదర్ డెయిరీ డైరెక్టర్ల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బిగ్‌షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: మదర్ డెయిరీ డైరెక్టర్ల ఎన్నికల్లో (Mother Dairy Elections) కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలింది. హయత్ నగర్లో మూడు డైరెక్టర్ల స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. మూడింటికి.. రెండు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. రచ్చ లక్ష్మి నర్సింహారెడ్డి, సుదగాని భాస్కర్ గౌడ్ విజయం సాధించగా.. మరో స్థానంలో కర్నాటి జయశ్రీ గెలుపొందారు. ఈ ఫలితాలతో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలినట్లైంది. ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య, యాదాద్రి డీసీసీ అధ్యక్షుడు సంజీవరెడ్డి, మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి తీరుపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రెండు జనరల్, ఒక మహిళా డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా.. 9 మంది పోటీపడ్డారు. కాగా.. ఈ ఎన్నికలపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తనను ఎన్నికల్లో ఓడించేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ వ్యక్తిని మదర్ డెయిరీ ఎన్నికల్లో నిలబెట్టి మద్దతివ్వడం సరికాదంటూ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, డీసీసీ అధ్యక్షుడు సంజీవరెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.

Next Story