- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BRS: వరుస వివాదాల్లో కేటీఆర్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ‘కారు’ పార్టీకి భారీ డ్యామేజ్ తప్పదా?
వరుస వివాదాల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ చిక్కుకోవడం హాట్ టాపిక్ గా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ (BRS) పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో (Moinabad Farm House) కోడి పందేలు, క్యాసినో కేసు వ్యవహారంలో ఆ పార్టీ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి (Pochampalli Srinivas Reddy)కి ఇవాళ పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. అయితే ఈ కేసులో ఇప్పటికే ఏ1గా ఉన్న భూపతిరాజు శివకుమార్ అలియాస్ గబ్బర్ సింగ్ కేటీఆర్‌కు (KTR) సన్నిహితుడు అనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఎమ్మెల్సీ పోచంపల్లికి తాజాగా పోలీసులు నోటీసులు ఇవ్వడం దుమారం రేపుతోంది. ఇటీవలే కేటీఆర్ బామ్మర్ది జన్వాడ ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ నిర్వహించారనే అభియోగాలు స్టేట్ పాలిటిక్స్‌లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇంతలో ఇప్పుడు కేటీఆర్ సన్నిహితుడు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేయడంతో బీఆర్ఎస్ పార్టీకి మరో మచ్చ అంటుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పోలీసుల చేతిలో పక్కా ఆధారాలు
మొయినాబాద్ మండలం తొల్కట్టలో గ్యాంబ్లింగ్‌కు అడ్డాగా మారిన ఫామ్‌హౌస్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి చెందినదిగా తెలుస్తోంది. సర్వే నంబర్ 165లో 11 ఎకరాలకు పైగా భూమిని అప్పట్లో చెన్నకేశవులు అనే వ్యక్తి నుంచి పోచంపల్లి కొనుగోలు చేసినట్లు రెవెన్యూ రికార్డులను బట్టి స్పష్టం అవుతోంది. అయితే ఆ ఫామ్‌హౌస్‌ను పోచంపల్లి నుంచి శివకుమార్ అనే వ్యక్తి లీజుకు తీసుకుని కోడిపందేలు, క్యాసినో వంటి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చినట్లు సమాచారం. అయితే ఈ ఫామ్‌హౌస్‌ను పోచంపల్లి లీజుకు ఇచ్చానని చెబుతున్నా పోలీసులు తమ విచారణలో పక్కా ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. దాదాపు రెండేళ్లుగా ఇక్కడ కోడిపందేలు, క్యాసినో (Casino) నిర్వహిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కానీ ఇన్నేళ్లు విషయం బయటకు రాలేదంటే నిర్వాహకులు, ఓనర్లు ఏ స్థాయిలో మేనేజ్ చేసుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చనే చర్చ జరుగుతోంది.
చిక్కుల్లో బీఆర్ఎస్!
బీఆర్ఎస్ హయాంలో అనేక అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉండగా తాజాగా కోడిపందేలా వ్యవహారం ఆ పార్టీకి తలనొప్పిగా మారే అవకాశాలున్నాయి. అసలే అధికారం కోల్పోయి గడ్డు పరిస్థితుల్లో ఉన్న కారు పార్టీకి ఆ పార్టీ నేతలపై వస్తున్న ఆరోపణలు ఇప్పుడు మరింత చిక్కుల్లో పడేస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ (Phone tapping case) కేసులో తీగ లాగితే డొంకంతా కదిలినట్లు తొల్కట్ట ఫామ్‌హౌస్ వ్యవహారంలో ఎలాంటి సంచలనాలు వెలుగు చూడబోతున్నాయనేది ఉత్కంఠ రేపుతున్నది.






