- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ ఇద్దరు ఐఏఎస్‌లకు బిగ్ షాక్.. నోటీసులు జారీ చేసిన హైకోర్టు
హైకోర్టు (High Court) ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేశారని, ఆర్టీఐ (RTI) చట్టం ప్రకారం తాను అడిగిన సమాచారం ఇవ్వలేదంటూ వడ్డం శ్యామ్ (Vaddam Shyam) అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: హైకోర్టు (High Court) ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేశారని, ఆర్టీఐ (RTI) చట్టం ప్రకారం తాను అడిగిన సమాచారం ఇవ్వలేదంటూ వడ్డం శ్యామ్ (Vaddam Shyam) అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం సంచలన ఆదేశాలను జారీ చేసింది. ఈ మేరకు ఆర్టీఐ అప్పీలేటు అధికారులుగా ఉన్న మాజీ జీహెచ్ఎంసీ కమిషనర్ కె.ఇలంబర్తి, ప్రస్తుత జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి కర్ణన్‌లకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. కోర్టు ఆదేశాలు ఇచ్చిప్పటికీ RTI చట్టం కింద సమాచారం ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని న్యాయమూర్తి భీమపాక నగేశ్ (Justice Bheemapaka Nagesh) ప్రభుత్వం తరఫు లాయర్‌ను ప్రశ్నించారు. సదరు ఐఏఎస్‌లపై కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోవద్దో వివరణ ఇవ్వాలన్నాని పేర్కొన్నారు. అదేవిధంగా కేసులో జనవరి 26 లోపు కౌంటర్ దాఖలు చేయాలని, లేదంటే వారి అఫిడవిట్లు స్వీకరించాలన్నారు. చేసిన తప్పుకు రూ.10 వేల వకు జరిమానా కూడా విధించాల్సి ఉంటుందని హైకోర్టు ధర్మాసనం హెచ్చరించింది.






