- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మన తొలివెలుగు’ రఘుకు బిగ్ షాక్.. నోటీసులు ఇచ్చిన NIA అధికారులు
ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ 'తొలి వెలుగు రఘు స్టూడియో'కు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) తాజాగా నోటీసులు జారీ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ 'మన తొలి వెలుగు రఘు స్టూడియో'కు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) తాజాగా నోటీసులు జారీ చేసింది. మాజీ మావోయిస్టు నేత కట్టా రామచంద్రా రెడ్డి (వికల్ప్) మృతి చెందిన ప్రాంతానికి వెళ్లి వీడియో షూట్ చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసినందుకు, అదేవిధంగా మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్య అరెస్టుకు కారణాలపై మరో వీడియో అప్‌లోడ్ చేసినందుకు గాను ఆయనకు నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఇవాళ గచ్చిబౌలి ఎన్ఐఏ కార్యాలయానికి వచ్చిన వివరణ ఇవ్వాలని మన తొలివెలుగు రఘుకు ఇచ్చిన నోటీసులలో స్పష్టంగా పేర్కొన్నారు.
కాగా, గతంలో సీపీఐ (మావోయిస్ట్) సెంట్రల్ కమిటీ సభ్యుడు కట్టా రామచంద్రా రెడ్డి ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌లో మరణించిన విషయం తెలిసిందే. ఆ ఘటనతో పాటు, మాజీ మావోయిస్టు గాదె ఇన్నారెడ్డిని ఎన్ఐఏ ఇటీవల అరెస్టు చేసింది. మావోయిస్టులకు మద్దతుగా ప్రసంగించిన ఆరోపణలపై ఆయనపై యూఏపీఏ చట్టం కింద కేసు నమోదైంది. ఈ క్రమంలోనే 'మన తొలి వెలుగు రఘు స్టూడియో' అప్‌లోడ్ చేసిన వీడియోలు ఎన్ఐఏ దృష్టికి వచ్చాయి. దీంతో ఆ ఛానెల్ బృందం సదరు వీడియోలపై వివరణ ఇవ్వాలని తాజాగా అధికారులు నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.






