రామ్‌గోపాల్ వర్మకు బిగ్ షాక్.. ఐదు సెక్షన్ల కింద కేసు నమోదు

by Malleboina Mahesh |   (  Updated:2025-09-18 03:47:41  IST  )

‘దహనం’ వెబ్ సిరీస్‌ (‘Dahanam’ web series) పై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అంజనా సిన్హా (Retired IPS officer Anjana Sinha) ఫిర్యాదు చేసింది. దీంతో ఆర్జీవీపై ఐదు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

రామ్‌గోపాల్ వర్మకు బిగ్ షాక్.. ఐదు సెక్షన్ల కింద కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్/శేరిలింగంపల్లి: తెలుగు ఇండస్ట్రీలో వివాదాస్పద దర్శకుడు ఎవరని సెర్చ్ చేస్తే.. లిస్టులో ఆగ్రస్థానంలో రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) పేరు ఉంటుంది. ఈ విషయంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. గతంలో సంచలన దర్శకుడిగా పేరుగాంచిన రామ్ గోపాల్ వర్మ గత కొంది సంవత్సరాలుగు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్‌ (Care of address for disputes)గా మారిపోతున్నారు. ఈ క్రమంలో ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టిన ఆర్జీవీ (RGV).. నేటికి కోర్టు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూనే ఉన్న విషయం తెలిసిందే. ఇది చాలదు అన్నట్లు తాజాగా రామ్ గోపాల్ వర్మ మరో వివాదంలో చిక్కుకున్నాడు.

రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌ (Rayadurgam Police Station)లో ఆయనపై కేసు నమోదు అయింది. ఇటీవల ఆయన తీసిన ‘దహనం’ వెబ్ సిరీస్‌ (‘Dahanam’ web series) పై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అంజనా సిన్హా (Retired IPS officer Anjana Sinha) ఫిర్యాదు చేసింది. దీంతో ఆర్జీవీపై ఐదు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీఎస్ అధికారి అంజనా సిన్హా తన ఫిర్యాదులో.. మావోయిస్టులపై తీసిన వెబ్ సిరీస్‌లో తన పేరును ప్రస్తావించిన ఆర్జీవీ.. కొన్ని సన్నివేశాలు తానే చెప్పిన విధంగా తీశామని ఆర్జీవీ చెప్పుకొచ్చాడని, తనకు తెలియకుండా, తన ప్రమేయం లేకుండా తన పేరును వాడారని అంజనా సిన్హా ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story