మోడీకి బిగ్ షాక్.. తెలంగాణలో ప్రధానికి వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు

by Bhoopathi Nagaiah |   (  Updated:2023-10-03 12:38:43  IST  )

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన వేళ పోస్టర్ల కలకలం కొనసాగుతున్నది.

మోడీకి బిగ్ షాక్.. తెలంగాణలో ప్రధానికి వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు
X

దిశ, డైనమిక్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన వేళ పోస్టర్ల కలకలం కొనసాగుతున్నది. తెలంగాణ పుట్టుకను పదే పదే అవమానించిన మోడీకి తెలంగాణలో పర్యటించే నైతిక హక్కు లేదంటూ పోస్టర్లు దర్శనమిచ్చాయి. ప్రస్తుతం ఈ పోస్టర్లకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తెలంగాణ రాష్ట్రాన్ని గడబిడగా తోపులాటలు, అణిచివేతల మధ్య విభజించారని చర్చ జరగకుండా ఏర్పడిన తెలంగాణలో ప్రజలు సంతోషంగా లేరని ప్రధాని పార్లమెంట్‌లో వ్యాఖ్యలు చేశారని ఈ పోస్టర్లలో పేర్కొన్నారు. కాగా రేపు ప్రధాని నరేంద్ర మోడీ మహబూబ్ నగర్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం రాష్ట్రానికి రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రధాని రాష్ట్రానికి వస్తున్న ప్రతిసారి మోడీకి వ్యతిరేకంగా పోస్టర్లు, బ్యానర్ల వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Next Story