- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహేష్ బాబుకు బిగ్ షాక్.. నోటీసులు జారీ చేసిన కన్స్యూమర్ ఫోరం
సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) కు బిగ్ షాక్ తగిలింది.

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu)కు బిగ్ షాక్ తగిలింది. సాయిసూర్య డెవలపర్స్‌పై నమోదైన కేసులో ఆయనకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం (Ranga Reddy District Consumer Forum) నోటీసులు జారీ చేసింది. అదేవిధంగా కేసులో మహేష్ బాబును మూడో ప్రతివాదిగా పిటిషనర్లు చేర్చారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సాయి సూర్య డెవలపర్స్ బ్రోచర్‌లో హీరో మహేష్‌బాబు ఫొటోతో ప్రమోషన్ చేయడం చూసి బాలాపూర్ (Balapur) గ్రామ పరిధిలోని ఓ లేఅవుట్‌లో ప్లాట్లు కొనుగోలు చేశామని ఓ వైద్యురాలు రంగారెడ్డి వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేసింది.
అయితే, ప్రతి ప్లాట్‌కు రూ.34.80 లక్షలు చెల్లించిన అనంతరం సదరు లేఅవుట్‌కు అసలు అనుమతులు లేవని తెలిసిందని ఆరోపించారు. కట్టిన డబ్బు తిరిగి ఇవ్వాలని రియల్ ఎస్టేట్ సంస్థ యాజమాన్యాన్ని గట్టిగా ప్రశ్నిస్తే.. సాయిసూర్య డెవలపర్స్ సంస్థ ఎండీ సతీష్ చంద్రగుప్తా (Sathish Chandra Gupta) కేవలం రూ.15 లక్షలు మాత్రమే వెనక్కి ఇచ్చారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె పిటిషన్ విచారణ చేపట్టిన వినియోగదారుల ఫోరం సాయిసూర్య డెవలపర్స్ సంస్థ ఎండీ సతీష్ చంద్రగుప్తా, ప్రమోషన్ చేసిన మహేష్‌బాబులను ప్రతివాదులుగా పేర్కొంటూ ఇవాళ నోటీసులు జారీ చేసింది. అయితే, నోటీసులు అందిన వారు జూలై 8 సోమవారం లోపు న్యాయవాదులతో సహా రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం ఎదుట హాజరుకావాలని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే హీరో మహేశ్ బాబు ఫోరం ఎదుట హాజరవుతాడా.. లేక వ్యక్తిగత సహాయకులను పంపుతారా అనేది ఆసక్తిగా మారింది.






