- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BRS ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి బిగ్ షాక్
బీఆర్ఎస్(BRS) నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Kaushik Reddy)కి అనూహ్య షాక్ తగిలింది.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Kaushik Reddy)కి అనూహ్య షాక్ తగిలింది. 2023 ఎన్నికల సమయంలో కమలాపురం పోలీస్ స్టేషన్‌లో కౌశిక్ రెడ్డిపై నమోదైన కేసు కొట్టివేసేందుకు నిరాకరణ హైకోర్టు(Telangana High Court) నిరాకరించింది. విచారణ ఎదుర్కోవాల్సిందేనని హైకోర్టు సోమవారం ఆదేశాలు చేసింది. అయితే.. 2023లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో తనను గెలిపించకుంటే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై నోడల్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై ప్రస్తుతం నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది. ఇప్పటికే దీనిపై కమలాపురం పోలీసులు అభియోగపత్రం దాఖలు చేశారు. కేసును కొట్టేయాలంటూ కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను ఇవాళ హైకోర్టు విచారించింది. విచారణను ఎదుర్కోవాల్సిందేనని ఆదేశించింది.






