- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్యే కూనంనేనికి సుప్రీం కోర్టులో బిగ్ రిలీఫ్.. ఆ పిటిషన్ కొట్టివేత
by Kema Shiva Kumar |
కొత్తగూడెం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao)కు హైకోర్టులో భారీ ఊరట లభించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: కొత్తగూడెం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao)కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నిబంధనల మేరకు అఫిడవిట్‌ను దాఖలు చేయలేదంటూ కొత్తగూడెంకు చెందిన నందులాల్ అగర్వాల్ అనే వ్యక్తి కూనంనేనిపై అనర్హత వేటు వేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తులు పిటిషన్‌ను క్వాష్ చేయడానికి నిరాకరించారు. అంశంపై సమగ్రంగా విచారణ జరగాలని తేల్చారు. దీంతో కూనంనేని హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఇవాళ ఆయన పిటిషన్‌పై మరోసారి విచారణ చేపట్టిన ధర్మాసనం సరైన ఆధారాలు లేవంటూ నందూలాల్ అగర్వాల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ తుది తీర్పును వెలువరించింది.
Next Story






