కేటీఆర్‌కు హైకోర్టులో బిగ్ రిలీఫ్.. ఆ కేసు కొట్టివేత

by Ramesh Naini |

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు బిగ్ రిలీఫ్ లభించింది.

కేటీఆర్‌కు హైకోర్టులో బిగ్ రిలీఫ్.. ఆ కేసు కొట్టివేత
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు బిగ్ రిలీఫ్ లభించింది. ఆయనపై నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు గురువారం కొట్టివేసింది. 2023 ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘించారని కేటీఆర్, గోరెటి వెంకన్నలపై సైఫాబాద్ పీఎస్‌లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ గతంలో హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన హైకోర్టు.. సైఫాబాద్ పీఎస్‌లో నమోదైన కేసును కొట్టివేసింది. రాజకీయ కక్షల కారణంగానే కేసు నమోదు చేశారని ఆయన తరఫు న్యాయవాది గత విచారణలో కోర్టుకు తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకే కేసు నమోదు చేసినట్లు పోలీసుల తరఫు న్యాయవాది గత విచారణలో వాదించారు. ఎలాంటి అనుమతి లేకుండా అమరవీరుల స్మారకం వద్ద గోరటి వెంకన్నను కేటీఆర్‌ ఇంటర్వ్యూ చేశారని, అందులో బీఆర్ఎస్‌కి లబ్ధి చేకూరేలా అంశాలు ఉన్నాయని గత విచారణలో వాదనలు జరిగాయి.

Next Story