- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొండా సురేఖకు బిగ్ రిలీఫ్.. నాగార్జున కీలక నిర్ణయం
మంత్రి సురేఖ, అక్కినేని ఫ్యామిలీ వివాదానికి ఎండ్ కార్డ్ పడింది.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: మంత్రి కొండా సురేఖ వర్సెస్ అక్కినేని నాగార్జున కటుంబం వివాదానికి ఎండ్ కార్డు పడింది. మంత్రి కొండ సురేఖపై (Konda Surekha) దాఖలు చేసిన క్రిమినల్ కేసును కేసును నాగార్జున (Nagarjuna) విత్ డ్రా చేసుకున్నారు. గతంలో నాగచైతన్య, సమంత విడాకుల విషయంలో తాను చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి కొండా సురేఖ ఇటీవల క్షమాపణలు కోరారు. ఈ నేపథ్యంలో ఇవాళ నాంపల్లికోర్టులో ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా వర్చువల్ గా హాజరైన నాగార్జున తన పిటిషన్ ను వెనక్కి తీసుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు. నాగార్జున నిర్ణయాన్ని కోర్టు ఆమోదించడంతో మంత్రి కొండా సురేఖ, హీరో నాగార్జునకు మధ్య వివాదం ముగిసినట్లైంది. మంగళవారం అర్ధరాత్రి మంత్రి కొండా సురేఖ తన ఎక్స్ ఖాతా వేదికగా నాగార్జునకు క్షమాపణలు చెప్పారు. ఆ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేయలేదని, తనకు నాగార్జునను గానీ ఆయన కుటుంబాన్ని గానీ కించపరిచే ఉద్దేశం లేదని ఆ ట్వీట్‍లో పేర్కొన్నారు. తాను గతంలో చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించారు.






