- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జగ్గారెడ్డిపై మనుషుల అక్రమ రవాణా కేసు.. కోర్టు కీలక తీర్పు
మానవ అక్రమ రవాణా కేసులో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డికి ఊరట లభించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి భారీ ఊరట లభించింది. మానవ అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డితో పాటు కాంగ్రెస్ నేత కుసుమ కుమార్‍పై నమోదైన కేసును ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు కోట్టివేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో నమోదు చేసిన ఈ కేసులో A1 గా ఉన్న జగ్గారెడ్డి, A3గా ఉన్న కుసుమ కుమార్‍ల కేసులో నేరాలు రుజువు కాలేదని వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది.
కేసు ఏంటి?:
కాగా 2004లో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జగ్గారెడ్డి నకిలీ డాక్యుమెంట్లు సమర్పించి భార్య పిల్లలుగా పేర్కొంటూ వేరే ముగ్గురు వ్యక్తులను అమెరికాకు తీసుకువెళ్లారని ఆరోపణలు ఉన్నయి. తన వెంట ఒక మహిళ ఒక యువకుడిని అమెరికా తీసుకువెళ్లిన జగ్గారెడ్డి తిరిగి ఆయన ఒక్కరే భారత్‍కు తిరిగి వచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. నాడు ఎమ్మెల్యేగా, విప్ గా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ 2018లో ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం బెయిల్ పై ఆయన బయటకు వచ్చారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి కోర్టు తీర్పు వెలువరించింది.






