- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్రూప్-2 ర్యాంకర్లకు హైకోర్టులో బిగ్ రిలీఫ్.. డివిజన్ బెంచ్ సంచలన ఆదేశాలు
పదేళ్ల క్రితం నిర్వహించిన గ్రూప్-2(Group-2) మెరిట్ లిస్ట్‌ను తెలంగాణ హైకోర్టు (Telangana High court) సింగిల్ బెంచ్ రద్దు చేసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: 2015-16లో నిర్వహించిన గ్రూప్-2 మెరిట్ లిస్ట్‌ను తెలంగాణ హైకోర్టు (Telangana High court) సింగిల్ బెంచ్ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు తమకు న్యాయం చేయాలంటూ ఇటీవలే పిటిషనర్లు మళ్లీ డివిజన్ బెంచ్‌కు అప్పీలుకు వెళ్లారు. ఈ మేరకు ఇవాళ మరోసారి వారి పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మానసం సంచలన ఆదేశాలు జారీ చేసింది. మెరిట్ లిస్ట్ చెల్లదు అని చెప్పిన సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా కేసులో తదుపరి విచారణను మరో ఆరు వారాలకు వాయిదా వేస్తున్నట్లుగా న్యాయమూర్తులు ప్రకటించింది.
కాగా, ఇదే కేసులో సింగిల్ బెంచ్ విచారణ సందర్భంగా జస్టిస్ నగేష్ భీమపాక (Justice Nagesh Bhimapaka) హైకోర్టు ఆదేశాలను టీజీపీఎస్సీ ఉల్లంఘించిందని, పరిధి దాటి వ్యవహరించిందని వ్యాఖ్యానించారు. వైట్నర్, దిద్దుబాటు ఉన్న జవాబుపత్రాల కరెక్షన్‌పై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ట్యాంపరింగ్ జరిగినట్లు తెలిసినా.. పేపర్ కరెక్షన్ చేయడం చట్టవిరుద్ధమని అన్నారు. సాంకేతిక కమిటీ సూచన ప్రకారం రీ కరెక్షన్ చేసి అభ్యర్థుల అర్హుల జాబితాను మళ్లీ మొదటి నుంచి నిర్ణయించాలని.. 8 వారాల్లోపు ఈ ప్రక్రియను ముగించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు హైకోర్టు సింగిల్ బెంచ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే, తాజాగా సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేస్తూ.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది.






