- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్
రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత ఫిర్యాదుపై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. బీజేపీ ఫిర్యాదుతో రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) నమోదు చేసిన కేసును శుక్రవారం హైకోర్టు (High Court) కొట్టివేసింది. గతేడాది మే 4న జరిగిన కొత్తగూడెం సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ (BJP) రిజర్వేషన్లు రద్దు చేస్తుందని అన్నారని దీని వల్ల బీజేపీ పరువుకు భంగం కలిగిందని గతంలో బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. అయితే ప్రజాప్రతినిధుల కోర్టు విచారిస్తున్న కేసు కొట్టివేయాలని రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కేసును కొట్టివేసింది. కాగా గోపనపల్లి ప్రైవేట్ భూ వివాదం కేసులోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గత సోమవారం సుప్రీంకోర్టులో ఊరట లభిచింది. ఈ కేసులో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎన్.పెద్దిరాజు దాఖలు చేసిన ట్రాన్స్ ఫర్ పిటిషన్ ను చీఫ్ జస్టిస్ బెంచ్ డిస్మిస్ చేసింది.






