- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING: నటుడు నవదీప్‌కు హైకోర్టులో బిగ్ రిలీఫ్
డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్ కు భారీ ఊరట లభించింది. అతనిపై నమోదైన డ్రగ్స్ కేసును హైకోర్టు కొట్టివేసింది.

దిశ, వెబ్‌డెస్క్: డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్ కు భారీ ఊరట లభించింది. అతనిపై నమోదైన డ్రగ్స్ కేసును హైకోర్టు కొట్టివేసింది. నవదీప్ వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని అడ్వొకేట్ వెంకట సిద్ధార్థ్ చేసిన వాదనలతో కోర్టు ఏకీభవించింది. గుడిమల్కాపూర్ లో నమోదైన డ్రగ్స్ కేసులో.. FIRలో మాత్రమే నవదీప్ పేరు పెట్టారని అడ్వొకేట్ కోర్టుకు వివరించారు. దీంతో స్పాట్ లో నవదీప్ వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరకకపోవడంతో కేసును కొట్టివేస్తున్నట్లు హైకోర్టు వెల్లడించింది.
2023 సెప్టెంబరులో నవదీప్ పై మాధాపూర్ పోలీస్ స్టేషన్ లో డ్రగ్స్ కేసు నమోదయింది. ఈ కేసులో నైజీరియన్ డ్రగ్ పెడ్లర్లు, ఫైనాన్షియర్లు అరెస్టయ్యారు. ఎండీఎంఏ, ఎక్స్ టసీ, కోకెయిన్ ను TSNAB సీజ్ చేసింది. ఇందులో నవదీప్ కూడా ఉన్నాడంటూ.. అతన్ని 39వ నిందితుడిగా చేర్చారు. అరెస్టైన వారిలో రామ్ చంద్ అనే వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం నవదీప్ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత నవదీప్ ఇంటిలో సోదాలు నిర్వహించారు. సెప్టెంబర్ 23న పోలీసుల విచారణకు హాజరవ్వగా ఐదుగంటలపాటు విచారణ జరిగింది. తాజాగా ఈ కేసులో నవదీప్ పై వచ్చిన ఆరోపణలకు సరైన ఆధారాలు లేకపోవడంతో హైకోర్టు కొట్టివేసింది.






