Heavy Rain Alert:ఆ జిల్లాల ప్రజలకు బిగ్ రెయిన్ అలర్ట్.. ఈ రాత్రి భారీ వర్ష సూచన!

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-06 13:46:08  IST  )

రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగలంతా ఎండలు దంచికొడుతున్నాయి. సాయంత్రం కాగానే ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది.

Heavy Rain Alert:ఆ జిల్లాల ప్రజలకు బిగ్ రెయిన్ అలర్ట్.. ఈ  రాత్రి భారీ వర్ష సూచన!
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగలంతా ఎండలు దంచికొడుతున్నాయి. సాయంత్రం కాగానే ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. తెలంగాణలో మధ్యాహ్నం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఓ వైపు ఎండలు, మరోవైపు తీవ్ర వడగాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ తరుణంలో రాత్రి సమయంలో వర్షాలు కురవడంతో కాస్త ఉపశమనం కలిగించిన.. ఈ అకాల వర్షాలకు పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. తెలంగాణలో నిన్న(ఆదివారం) రాత్రి పలు చోట్ల వర్షం బీభత్సం సృష్టించింది. హైదరాబాద్‌లో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అంతేకాదు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గాలివానలకు ఇళ్ల పైకప్పులు ఎగిరిపడ్డాయి.

ఈ క్రమంలో తాజాగా తెలంగాణకు వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో రాబోయే రెండు గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా. ఈ రోజు రాత్రి తెలంగాణలోని 23 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట్, రంగారెడ్డిలో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఈ రాత్రి పలు చోట్లు వర్షాలు కురుస్తాయని తెలిపారు. రెండు రోజుల పాటు తెలంగాణలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పింది.

గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఈ క్రమంలో వాతావరణ శాఖ అధికారులు రేపు(బుధవారం) తెలంగాణలోని 17 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్, 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అయితే రోజంతా నిశ్శబ్దంగా ఉన్న వరణుడు రాత్రి భారీ వర్షం కురిపిస్తున్నాడు. వాతావరణంలో నెలకొంటున్న ఈ భిన్న పరిస్థితులను ప్రజలు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

Next Story