తెలంగాణకు మరోసారి బిగ్ రెయిన్ అలర్ట్

by Muthe.Rajitha |

రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నేడు, రేపు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

తెలంగాణకు మరోసారి బిగ్ రెయిన్ అలర్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నేడు, రేపు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో, పలు జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులు, గాలివేగం గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈ కారణంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని ఐఎండీ పేర్కొంది.

ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, కొమరం భీం, అసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నందున ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

కామారెడ్డి జిల్లాలో రికార్డు స్థాయి వర్షపాతం:

రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం కామారెడ్డి జిల్లాలో నమోదైంది. గాంధారి మండలంలో ఏకంగా 27 సెం.మీ.ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ఈ భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొన్నిచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శుక్రవారం ఐఎండీ వివరాల ప్రకారం వర్షాపాతం వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలో 24 సెం.మీ, నిర్మల్ జిల్లా ముధోల్ 22 సెం.మీ, కామారెడ్డి జిల్లా సదాశివనగర్ 16 సెం.మీ, లింగంపేట్ 16 సెం.మీ, నిజామాబాద్ జిల్లా వర్ని లో 16 సెం.మీ, డిచ్ పల్లిలో 15 సెం.మీ, భీంగల్ లో 13 సెం.మీ, మెదక్ లో 12 సెం.మీ, కరీంనగర్ జిల్లా గంగాధరలో 12 సెం.మీ, జగిత్యాల జిల్లా కత్లాపూర్ లో 11 సెం.మీ, కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ లో 11 సెం.మీ, నిజామాబాద్ జిల్లా కోటగిరిలో 11 సెం.మీ, రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తిలో 10 సెం.మీ, కామారెడ్డి జిల్లా బిక్నూర్ లో 9 సెం.మీ, చొప్పున వర్షాపాతం నమోదైంది.

Next Story