- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BIG News: అసెంబ్లీ సమావేశాలకు గులాబీ బాస్ డుమ్మా..! రాకపై నో క్లారిటీ
అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. లీడర్ ఆఫ్ అపోజిషన్(ఎల్‌వోపీ)గా ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఉన్నారు. ఆయన సమావేశాలకు హాజరుకావడంపై పార్టీ క్లారిటీ ఇవ్వలేదు. ఆదివారం ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో మాత్రం అసెంబ్లీ, మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కానీ, ఆయన అసెంబ్లీకి రాకపై మాత్రం స్పష్టంగా ప్రకటించలేదు. మరోవైపు పార్టీ నేతలు సైతం కేసీఆర్ సమయం వచ్చినప్పుడు వస్తారని, ఎవరో రమ్మని అడిగితే రారని అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వాన్ని ఎదుర్కొవడానికే కేసీఆర్ అవసరం లేదని, తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొంటున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డితో సహా కేబినెట్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం అసెంబ్లీకి వచ్చి సలహాలు, సూచనలు ఇవ్వాలని కేసీఆర్‌కు విజ్ఞప్తులు చేస్తున్నారు. వస్తే ఆయనను ఇరుకునపెట్టే కార్యక్రమాలకు సన్నహాలు చేస్తున్నట్టు సమాచారం.
గతేడాది అసెంబ్లీ సెషన్లలో ఒకటే రోజు అటెండ్
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్‌లో మూడో అసెంబ్లీ తొలి సెషన్‌ను నిర్వహించారు. 6 రోజులపాటు సభ నిర్వహించినా కేసీఆర్ తొంటికి ఆపరేషన్‌తో గైర్హాజరయ్యారు. ఆర్థిక స్థితిగతులు, విద్యుత్ రంగంపై లఘుచర్చ నిర్వహించినా పాల్గొనలేకపోయారు. ఈ ఏడాది జూలైలో బడ్జెట్ సెషన్ నిర్వహించారు. జూలై 25న బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు హాజరయ్యారు. అనంతరం బడ్జెట్‌పై మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. ఈ తర్వాత మళ్లీ సమావేశాలకు హాజరుకాలేదు. కేటీఆర్, హరీశ్‌రావులు ఇద్దరు ప్రభుత్వ వైఫల్యాలపై అసెంబ్లీ వేదికగా నిలదీశారు. ప్రధానప్రతిపక్ష నేతగా ప్రొటోకాల్ ఉన్నప్పటికీ ఆయన హాజరై బడ్జెట్‌పైనా మాట్లాడలేదనే ఆరోపణలున్నాయి. ప్రధానప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ వరద సమయంలో ఆపద సమయంలో ప్రజల మధ్యకు రాలేదు. ప్రొటోకాల్ విధులకు ఆయన దూరంగా ఉండటంపై అధికారపక్షం ఇప్పటికే విమర్శలు గుప్పిస్తోంది. కేవలం రాజకీయ విమర్శలే తప్ప ప్రజలను ఆదుకోవడంలో కేసీఆర్ విఫలమంటూ ఆరోపణలు ఎక్కుపెట్టింది. ఆయినప్పటికీ కేసీఆర్ నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై స్పష్టత లేదు. సమావేశాలకు దూరంగా ఉంటారనే ప్రచారం జరుగుతోంది. హాజరవుతారా? లేదా? అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.






