- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYD: నగర వాసులకు భారీ శుభవార్త.. ఇక ట్రాఫిక్ కష్టాలకు చెల్లు!
త్వరలో ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొండాపూర్ ఫ్లై ఓవర్ త్వరలో ప్రారంభం కానుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: త్వరలో ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొండాపూర్ ఫ్లై ఓవర్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నగరవాసులకు, ప్రధానంగా ఐటీ కారిడార్‌లో ప్రయాణించే వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొండాపూర్‌కు వెళ్లే అత్యాధునిక మల్టీ-లెవెల్ ఫ్లై ఓవర్ నిర్మాణం దాదాపు పూర్తయింది. ఈ ఫ్లై ఓవర్ ను సీఎం రేవంత్ రెడ్డి వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభించనున్నారు. ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుంది. ప్రయాణ సమయం ఆదా కానుంది.
ప్రాజెక్టు వివరాలు
ఫ్లై ఓవర్‌ను రూ.178 కోట్ల వ్యయంతో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా నిర్మించారు. 1.2 కిలోమీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పుతో ఆరు లేన్లతో అందుబాటులోకి రానుంది. ఇది ఇప్పటికే ఉన్న రెండు ఫ్లై ఓవర్లపై నిర్మించిన మూడో స్థాయి నిర్మాణం. కింద గచ్చిబౌలి జంక్షన్ ఫ్లై ఓవర్, దానిపై శిల్పా లేఅవుట్ ఫేజ్ 1 ఫ్లై ఓవర్ ఉండగా, ఇప్పుడు దానికి పైన ఫేజ్ 2 ఫ్లై ఓవర్ నిర్మించారు. దీంతో గచ్చిబౌలి జంక్షన్ వద్ద తీవ్రమైన ట్రాఫిక్ సమస్యను ఈ ఫ్లై ఓవర్ చాలా వరకు తగ్గిస్తుంది.
మెరుగైన కనెక్టివిటీ
ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్, హఫీజ్‌పేట్ మార్గాల్లో వెళ్లే వాహనాలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు మెరుగైన కనెక్టివిటీ లభిస్తుంది. ప్రయాణ సమయం ఆదాతో పాటు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా వేగంగా గమ్య స్థానాలకు చేరుకోవచ్చు. కొండాపూర్ ప్రాంతం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్, అక్కడి నుంచి కొండాపూర్ ప్రాంతాలకు వెళ్ళేందుకు గచ్చిబౌలి వద్ద ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండా నేరుగా వెళ్లే వెసులుబాటు కలదు. జీహెచ్‌ఎంసీ అధికారులు ఈ ఫ్లై ఓవర్ పనులను వేగవంతం చేశారు. గతంలో కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయినప్పటికీ, పనులు ప్రస్తుతం తుది దశలో ఉన్నాయి. ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చేసి. ఈ ఫ్లై ఓవర్ ప్రారంభం హైదరాబాద్ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఒక ముఖ్యమైన అడుగు అవుతుంది. ఈ ఫ్లై ఓవర్ ను పూర్తి చేయడానికి కమిషనర్ ఆర్.వి.కర్ణన్ పలు సార్లు పర్యటన చేసి వేగవంతంగా పూర్తి చేసేందుకు ప్రాజెక్టు ఇంజనీర్లను ఆదేశించారు. ఎస్ఆర్డీపీ ద్వారా హైదరాబాద్ లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీఠ వేసిన నేపథ్యంలోఈ ప్రాజెక్టు ద్వారా 23వ ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానున్నది.
వేగంగా పనులు
సీఆర్ఎంపీ, ఎస్ఆర్డీపీల ద్వారా చేపట్టిన పనులు పూర్తి కావడంతో గతంలో కంటే ఎక్కువ వేగంగా వెళ్లేందుకు స్పీడ్ పెంచినట్లు అధికారులు చెప్తున్నారు. ఎస్ఆర్డీపీ ద్వారా చేపట్టిన మొత్తం 42 పనుల్లో ఈ ఫ్లై ఓవర్ తో 37 పనులు పూర్తి అయ్యాయి. ఫలక్ నుమా రైల్వే ఓవర్ బ్రిడ్జి, శాస్త్రి పురం ఆర్వోబీ పనులు రైల్వే పోర్షన్ రెండు మూడు నెలల్లో పూర్తి చేయాలని టార్గెట్ నిర్ణయించి కమిషనర్ ఆర్.వి కర్ణన్ రైల్వే అధికారులను కోరారు. వారికి జులై నెల చివరి వరకు ఫలక్ నూమా ఆర్వోబీ, ఆగస్టు నెల చివరి వరకు శాస్త్రిపురం ఆర్వోబీ పనులను పూర్తి చేయాలని టార్గెట్ పెట్టారు. గతంలో జీహెచ్ఎంసీకి సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు నగర అభివృద్ధికి నిధులను మంజూరు చేసి జీహెచ్ఎంసీకి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు. ప్రజాపాలన ప్రభుత్వంలో నగర అభివృద్ధికి హెచ్ సిటీ ద్వారా రూ. 7032 కోట్ల వ్యయంతో 58 పనులు చేపట్టనున్నారు. అందులో 28 ఫ్లైఓవర్లు, 13 అండర్ పాస్ లు, నాలుగు ఆర్వోబీలు, మూడు రైల్వే అండర్ బ్రిడ్జిలు, 10 రోడ్డు వెడల్పు పనులు చేపట్టేందుకు ప్రతిపాదించారు. ఈ పనులను టెండర్ దశ పూర్తిచేసి అగ్రిమెంట్ దశలో ఉన్నాయి. ఈ పనులను కొన్ని జూన్ మాసంలో ప్రారంభమయ్యే అవకాశం కలదు.






