తెలంగాణ మహిళలకు భారీ శుభవార్త.. CM రేవంత్ కీలక ప్రకటన

by Gantepaka Srikanth |

రాష్ట్ర ప్రభుత్వం(Congress Government) పూర్తిగా అండగా ఉంటుంది.. ఆర్థికంగా ఎదిగేందుకు ప్రయత్నించండి అని తెలంగాణ మహిళల(Telangana womens)కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) భరోసా ఇచ్చారు.

తెలంగాణ మహిళలకు భారీ శుభవార్త.. CM రేవంత్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం(Congress Government) పూర్తిగా అండగా ఉంటుంది.. ఆర్థికంగా ఎదిగేందుకు ప్రయత్నించండి అని తెలంగాణ మహిళల(Telangana womens)కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) భరోసా ఇచ్చారు. శనివారం జూబ్లీహిల్స్‌లో వీహబ్‌ ఉమెన్‌ యాక్సిలరేషన్‌ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం అక్కడి స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేదే తమ లక్ష్యమన్నారు. తెలంగాణ 1 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీకి చేరుకోవాలంటే మహిళలు కోటీశ్వరులు కావాలని ఆకాంక్షించారు. మహిళా శక్తి ఎలా ఉంటుందో ఇందిరా గాంధీ ప్రపంచానికి చూపించారని గుర్తుచేశారు. మహిళలే దేశానికి ఆదర్శం అని చెప్పారు.

తెలంగాణ మహిళలకు తప్పకుండా అండగా నిలబడతాం.. ఆర్థికంగా ఎదగండి అని పిలుపునిచ్చారు. కార్పొరేట్ కంపెనీలకు డబ్బులు ఇస్తే తీసుకొని దేశం విడిచి పారిపోతున్నారు. మహిళలకు ఇచ్చే ప్రతీ రూపాయి వడ్డీతో సహా చెల్లిస్తున్నారు. మహిళల్లో ఉన్న క్రమశిక్షణ ఇంకెవరిలోనూ ఉండదు అని అన్నారు. ప్రభుత్వం కూడా ఆడబిడ్డలను ప్రొత్సహించాలనే లక్ష్యంతోనే ముందుకు వెళ్తోందని తెలిపారు. ఆడబిడ్డలు ఆర్థికంగా నిలదొక్కకుంటేనే.. కుటుంబాలు బావుంటాయని చెప్పారు. ఇప్పటికే వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి వ్యాపారాన్ని మహిళలకు అప్పగించాం.. మీరు సమర్ధవంతంగా నిర్వహిస్తే అవసరమైతే మరో వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి వ్యాపారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాం.. స్వయం సహాయక సంఘాల మహిళలు ఉత్పత్తి చేసిన వాటినే రాష్ట్రానికి వచ్చే అతిథులకు బహుమతులుగా అందిస్తున్నామని అన్నారు. అంతేకాదు.. రాష్ట్రంలోని కోటి మంది మహిళలకు ఒక యూనిట్ ఐడీ కార్డు ఇస్తాం.. మహిళల ఆరోగ్యం నుంచి సంపాదన వరకు వివరాలన్నీ యూనిట్ కార్డులోనే ఉండేలా రూపొందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈనెల 21న ఇందిరా మహిళ స్టాళ్లను మిస్‌ వరల్డ్‌ కంటెస్టెంట్లు సందర్శిస్తారని అన్నారు.

Next Story