బెంగళూరు ఎక్స్​ప్రెస్​ ట్రైన్​ బోగీలో పొగలు..

by Maddikunta Saikiran |
బెంగళూరు ఎక్స్​ప్రెస్​ ట్రైన్​ బోగీలో పొగలు..
X

దిశ, వెబ్‌డెస్క్: మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్ల రైల్వేస్టేషన్లో బుధవారం రాత్రి రైలులో ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు ఎక్స్‌ప్రెస్ జడ్చర్ల వద్దకు చేరుకోగానే ఏసీ బోగీలో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే, ప్రమాదం జరిగిన విషయాన్ని ప్రయాణికులు వెంటనే అధికారులకు అందజేశారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ట్రైన్​ను అరగంట వరకు నిలిపివేశారు. ఆక్సీజన్ సిలిండర్ల సాయంతో పొగలను అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం మరమ్మతులు నిర్వహించి ట్రైన్​ను అక్కడి నుంచి పంపించడంతో ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు. రాత్రి 8.30 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రయాణికులు పేర్కొన్నారు. కాగా, ఏసీ బోగిలోని మోటార్​లో సాంకేతిక లోపం తలెత్తడంతోనే పొగలు వ్యాప్తించాయని, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed