బిగ్ బ్రేకింగ్ : హీరో రానా, నిర్మాత సురేష్ బాబులపై క్రిమినల్ కేసు

by Disha Web Desk 4 |
బిగ్ బ్రేకింగ్ : హీరో రానా, నిర్మాత సురేష్ బాబులపై క్రిమినల్ కేసు
X

దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: భూ వివాదంలో సినీ హీరో దగ్గుపాటి రాణా, నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబుపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఫిలిం నగర్‌లోని ఓ భూమికి సంబంధించి వీరికి ప్రమోద్ కుమార్ అనే వ్యక్తితో గొడవలు ఉన్నాయి. కాగా రౌడీలతో తనను తన స్థలం నుంచి ఖాళీ చేయించారని కొంత కాలం క్రితం ప్రమోద్ కుమార్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసాడు. అయితే పోలీసులు ఈ ఫిర్యాదును పట్టించుకోలేదు. దాంతో ప్రమోద్ కుమార్ నాంపల్లి కోర్టులను ఆశ్రాయించాడు. ప్రమోద్ కుమార్ పిటిషన్‌ను విచారణ‌కు స్వీకరించిన కోర్టు రాణా, సురేష్ బాబు తో పాటు మరి కొందరిపై కేసులు నమోదు చేసి విచారణకు రావాలని సమన్లు జారీ చేసింది.

Next Story

Most Viewed