- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING: వికారాబాద్ స్టీల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు
వికారాబాద్ జిల్లా పరిగి మండలం లక్ష్మీదేవిపల్లిలో ఉన్న ఓ స్టీల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు జరిగింది.

దిశ, వెబ్‌డెస్క్: వికారాబాద్ జిల్లాలోని ఓ స్టీల్ ఫ్యాక్టరీలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. పరిగి మండలం లక్ష్మీదేవిపల్లిలో ఈ ఘటన జరిగింది. Sugna Metals Limited కంపెనీలో ఒక్కసారిగా స్టీల్ ప్లాంట్ బట్టీ పేలడంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. దట్టమైన పొగ వెలువడుతుండటంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ పేలుడు ఘటన సమయంలో కంపెనీలో ఉన్న పలువురు కార్మికులకు గాయాలైనట్లు తెలుస్తోంది. దీనిపై స్పష్టత రావలసి ఉంది. పేలుడు నేపథ్యంలో కంపెనీ యాజమాన్యం ఎవ్వరినీ లోపలికి అనుమతించడం లేదు.
ప్రమాదం జరిగిన వెంటనే మీడియా, స్థానికులు అక్కడికి చేరుకోగా, సెక్యూరిటీ సిబ్బంది గేట్లు వేసి లోపలికి ఎవరినీ రానివ్వలేదు. ఘటన గురించి ప్రశ్నించగా, అది ప్లాంట్ పేలుడు కాదని, కేవలం లారీ టైర్ పేలిందని చెప్పి వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో అదనపు ఫైర్ ఇంజన్లను కూడా రప్పించినట్లు తెలుస్తోంది. పరిస్థితి అదుపులోకి వచ్చాకే ఎవరైనా గాయపడ్డారా? ప్రమాదానికి గల కారణాలేంటి? అనే విషయాలు తెలిసే అవకాశం ఉందని ఫైరింజన్ అధికారులు పేర్కొన్నారు.






