Telangana:ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. హాల్‌టికెట్లు విడుదల

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-19 11:45:26  IST  )

రాష్ట్రంలో ఈ ఏడాది నిర్వహించిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షల ఫలితాలు గత నెల(ఏప్రిల్)లో టీజీ ఇంటర్ బోర్డు విడుదల చేసిన విషయం తెలిసిందే.

Telangana:ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. హాల్‌టికెట్లు విడుదల
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఈ ఏడాది నిర్వహించిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షల ఫలితాలు గత నెల(ఏప్రిల్)లో తెలంగాణ ఇంటర్ బోర్డు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులకు ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు, తక్కువ మార్కులు వచ్చాయని భావిస్తున్న విద్యార్థులకు ఇంప్రూవ్‌మెంట్ ఎగ్జామ్స్(Inter Advanced Supplementary Exams) నిర్వహిస్తున్నారు. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్ కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ మొత్తం 4,12,724 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇందులో ఇంప్రూవ్‌మెంట్‌ రాసేవారు 50 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.

ఈ తరుణంలో.. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు(Intermediate Board) తాజాగా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ హాల్‌టికెట్లు విడుదల చేసింది. ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల(మే) 22 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇక, ఈ ఏడాది జరగనున్న సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ ఫస్టియర్, మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఈ క్రమంలో విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://tgbie.cgg.gov.in/ ద్వారా తమ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. విద్యార్థులు తమ రూల్ నెంబర్, పాత హాల్‌టికెట్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Next Story