పర్యాటకులకు బిగ్ అలర్ట్.. మరోసారి తెరుచుకున్న శ్రీశైలం గేట్లు

by Malleboina Mahesh |

ఎగువ నుంచి వరద పెరగడంతో శ్రీశైలం డ్యామ్ గేట్లను అధికారులు మరోసారి ఎత్తారు. ఈ సీజన్ లో గేట్లను ఎత్తడం ఇది ఐదో సారిగా అధికారులు తెలిపారు.

పర్యాటకులకు బిగ్ అలర్ట్.. మరోసారి తెరుచుకున్న శ్రీశైలం గేట్లు
X

దిశ, వెబ్ డెస్క్: వరుసగా నెల రోజుల పాటు తెరుచుకున్న శ్రీశైలం జలాశయం (Srisailam Reservoir) గేట్లు రెండు రోజుల క్రితం మూసివేశారు. అయితే ఎగువన ఉన్న తుంగభద్ర జలాశయం నుంచి కంటిన్యూగా వరద వస్తుండటంతో డ్యామ్ పూర్తిస్థాయిలో నిండిపోయింది. దీంతో అప్రమత్తం అయిన అధికారులు ఎగువ నుంచి వస్తున్న వరదకు తగ్గట్టుగా ఒ గేటును 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సీజన్ లో శ్రీశైలం డ్యామ్‌ గేట్లను ఎత్తడం ఇది ఐదోసారి కావడం విశేషం. ప్రస్తుతం డ్యామ్‌లో నీటిమట్టం 884.1 అడుగుల వద్ద కొనసాగుతోంది. ప్రస్తుత నీటి నిల్వ 210.5 టీఎంసీలు కాగా కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని అధికారులు నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే వరుస సెలవులు రావడం, వినాయక నిమజ్జనాలకోసం శ్రీశైలానికి భక్తులు, పర్యాటకులు పోటెత్తుతున్నారు. దీంతో ఘాట్ రోడ్లు మొత్తం వాహనాలతో నిండిపోయాయి.

Next Story