- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అశావహులకు బిగ్ అలర్ట్.. మద్యం టెండర్లకు సర్కార్ సమాయత్తం!
రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల టెండర్లకు సంబంధించి రాజకీయ వర్గాలలో చర్చ మొదలయ్యింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల టెండర్లకు సంబంధించి రాజకీయ వర్గాలలో చర్చ మొదలయ్యింది. 2025–27 సంవత్సరంలో ఏర్పాటు చేసే మద్యం దుకాణాలకు ప్రస్తుత ఆగస్టులోనే టెండర్లు నిర్వహించేందుకు ప్రభుత్వ చర్యలు చేపట్టబోతున్నట్లు తెలుస్తున్నది. మూడు నెలల ముందుగానే దరఖాస్తు ప్రక్రియ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో మద్యం దుకాణాల నిర్వహకులు అలెర్ట్ అయ్యారు. నాడు 2023లో నవంబర్ 30 వరకు గడువున్నా ఆగస్ట్ 4వ తేదీన ప్రక్రియ ప్రారంభించి, ఆగస్టు 18వ తేదీ వరకు ధరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నిర్వహించారు. 2,620 మద్యం దుకాణాలకు ఆగస్టు 21వ తేదీన లాటరీ ప్రక్రియ నిర్వహించారు.
మద్యం దుకాణాల ఏర్పాటుపై రగడ
మద్యం దుకాణాలకు ముందస్తు టెండర్లు నిర్వహిస్తున్నారన్న సమాచారం బయటకు రావడంతో, కాంగ్రెస్ విమర్శలను ఎదుర్కొనేందుకు అప్రమత్తమయ్యింది. 2023–25లో మ్యదం టెండర్లను నాటి ప్రభుత్వం నాలుగు నెలల ముందే ఎందుకు నిర్వహించిందని అధికార పార్టీ నేతలు గత పాలకులను ప్రశ్నిస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల తరుణంలో హడావుడిగా టెండర్లు ప్రక్రియ ప్రారంభించి, లాటరీ ప్రక్రియ నిర్వహించింది మీరు కాదా అని నిలదీస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం దుకాణాల ఎంపిక ప్రక్రియ పారదర్శంగా నిర్వహిస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మద్యం టెండర్ల పై మాట్లాడే హక్కు గత పాలకులు కోల్పోయారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
2025–27లో మద్యం దుకాణాలు పెరిగే అవకాశమున్న ఏరియాలు
రాష్ట్రంలో కొత్తగా 12 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతో పట్టణ ప్రాంతాల సంఖ్య పెరిగింది. భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా మారుస్తూ ప్రభుత్వం ఫిబ్రవరిలో గెజిట్ విడుదల చేసింది. స్టేషన్‌ఘన్‌పూర్, కేసముద్రం, ఎదులాపురం, అశ్వరావుపేట్, చేవెళ్ల, మొయినాబాద్, గడ్డపోతారం, గుమ్మడిదల, ఇస్నాపూర్, దేవరకద్ర, మద్దూరు, పరకాల మున్సిపాలిటీలుగా ఆవిర్భవించాయి. రూరల్ ఏరియా ప్రాంతాలను మున్సిపాలీటీలుగా గుర్తించడంతో ఈ ప్రాంతాలలో గతంలో కంటే మద్యం దుకాణాల పెరిగే అవకాశం ఉంది. 2023–25లో 2620 మద్యం దుకాణాలకు ఒక లక్ష 32వేలలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఎక్సయిజ్ శాఖకు యాన్యవల్ ఫీజ్ తో కలిపి రూ. 2,460కోట్లు ఆదాయం సమకూరింది. 2019లో దరఖాస్తుల ద్వారా రూ.975 కోట్లు ఆదాయం రాగా, 2021లో 67వేల 849 దరఖాస్తులు రావడంతో రూ.1357 కోట్ల మేర ఆదాయం సమకూరింది.
2023–25 జిల్లాల వారీగా మద్యం షాపుల మొత్తం సంఖ్య 2,620
అదిలాబాద్ 40
అసిఫాబాద్ 32
మంచిర్యాల 73
నిర్మల్ 47
హైదరాబాద్ 80
సికింద్రాబాద్ 99
జగిత్యాల 71
కరీంనగర్ 94
పెద్దపల్లి 77
సిరిసిల్ల 48
ఖమ్మం 122
కొత్తగూడెం 88
గద్వాల్ 36
మహబూబ్ నగర్ 90
నాగర్ కర్నూల్ 67
వనపర్తి 37
మెదక్ 49
సంగారెడ్డి 101
సిద్దిపేట 93
నల్గొండ 155
సూర్యాపేట 99
భువనగిరి 82
కామారెడ్డి 49
నిజామాబాద్ 102
మల్కాజ్ గిరి 88
మేడ్చల్ 114
సరూర్ నగర్ 134
శంషాబాద్ 100
వికారాబాద్ 59
జనగాం 47
భూపాలపల్లి 60
మహబూబాబాద్ 59
వరంగల్ రూరల్ 63






