- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సామాన్యులకు బిగ్ అలర్ట్.. రేపు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులు బంద్
ఎన్నికల ముందు తమకు ప్రతి నెల రూ.5 వేల గౌరవ వేతనం ఇస్తామని, కమీషన్ పెంచుతామని ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని రేషన్ డీలర్లు డిమాండ్ చేస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల ముందు తమకు ప్రతి నెల రూ.5 వేల గౌరవ వేతనం ఇస్తామని, కమీషన్ పెంచుతామని ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని రేషన్ డీలర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హామీలపై రేవంత్ సర్కార్ ఉదాసీనంగా వ్యవహరిస్తున్న తీరుకు గాను రేపు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులను మూసి వేయనున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 21 నెలలు గడుస్తున్నా.. తమకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం అధ్యుక్షుడు బత్తుల రమేష్ బాబు కామెంట్ చేశారు.
రేషన్ డీలర్ల కుటుంబాలకు హెల్త్ కార్డులు, దుకాణాల అద్దె, బియ్యం దిగుమతి ఛార్జీలను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేస్తూ రేపు రేషన్ షాపుల బంద్‌కు పిలుపునిచ్చినట్లుగా తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘ సభ్యులు వెల్లడించారు. అదేవిధంగా గత ఐదు నెలలుగా కమిషన్ బకాయిలు, గన్నీ బ్యాగుల బిల్లులు చెల్లించకపోవడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం పంపిణీని నిరవధికంగా నిలిపివేస్తామని, పెండింగ్‌లో ఉన్న బకాయిలు చెల్లించకపోతే త్వరలోనే సెక్రటేరియట్‌ను కూడా ముట్టడిస్తామని హెచ్చరించారు.






