- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్..నేడు పిడుగులతో కూడిన వర్షాలు
తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్..నేడు పిడుగులతో కూడిన వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్..నేడు పిడుగులతో కూడిన వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఏపీలోని ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉన్నట్లు పేర్కొంది. పలు చోట్ల పిడుగులు పడే ఛాన్స్ ఉన్నట్లు అంచనా వేసింది. శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉన్నాయని వెల్లడించింది.
మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, పశ్చిమగోదావరి, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, వైఎస్సార్ కడప, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించగానే వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలలని, చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ కింద అస్సలు నిలబడొద్దని కోరింది. తెగిపడిన విద్యుత్ వైర్లకు వీలైనంత దూరంగా ఉండండి అంటూ సూచనలు చేసింది. అటు తెలంగాణలోని ఆదిలాబాద్, మంచిర్యాల ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వంచన వేసింది వాతావరణ శాఖ.






