- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ వాహనదారులకు అలర్ట్.. వాటి సర్వీస్ ఛార్జిలు పెంపు
by Naga Rani Yarlagadda |
తెలంగాణలో పలురకాల రవాణా సర్వీసు ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో పలురకాల రవాణా సర్వీసు ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రవాణాశాఖ అధికారులు ఇందుకు సంబంధించిన వివరాలను అధికారిక వెబ్ సైట్ లో ఉంచారు. ఫైనాన్స్ పై వెహికల్స్ తీసుకున్న వారికి హైపొథెకేషన్ ఫీజును రూ.2,135 నుంచి ఏకంగా రూ.3,135కు పెంచేశారు. లెర్నర్స్ లైసెన్సు, డ్రైవింగ్ టెస్ట్ ఫీజుల ఛార్జీలు రూ.335 నుంచి రూ.440కి పెంచారు. టూవీలర్, కారు లెర్నర్స్ లైసెన్స్ ఫీజు రూ.450 నుంచి రూ.585కు పెంచారు.
గతంలో డ్రైవింగ్ టెస్టుకు రూ.1035 వసూలు చేస్తే.. ప్రస్తుతం దానిని రూ.1135కు పెంచారు. వెహికల్ యాజమాన్య బదిలీ ఫీజు రూ.935 నుంచి రూ.1805కు పెంచేశారు. ఆటో రిక్షా డ్రైవింగ్ టెస్ట్ ఫీజును రూ.800 నుంచి రూ.900గా ఫిక్స్ చేశారు. వాహనాల ఆర్సీల కాలపరిమితి, నేషనల్ పర్మిట్ల ఫీజుల్ని కూడా పెంచడంతో.. వాహనదారులకు షాక్ తగిలినట్లయింది.
Next Story






