- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ ‘లా సెట్’ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. రిజల్ట్స్ అప్డేట్
2025-26 విద్యా సంవత్సరానికి మూడు సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ కోర్సు, ఐదు సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ(LLB), ఎల్‌ఎల్‌ఎం(LLM) కోర్సుల్లో ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి ఇటీవల ప్రవేశ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: 2025-26 విద్యా సంవత్సరానికి మూడు సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ కోర్సు, ఐదు సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ(LLB), ఎల్‌ఎల్‌ఎం(LLM) కోర్సుల్లో ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి ఇటీవల ప్రవేశ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా ఫలితాలపై ఉన్నత విద్యామండలి కీలక ప్రకటన చేసింది. బుధవారం ఫలితాలు(Law Cet Results) విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ పరీక్షలను గత జూన్ 6వ తేదీన ఒకేరోజు మొత్తం 3 షిఫ్టుల్లో ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు మొత్తం 57,715 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కోర్సుల వారీగా చూస్తే మూడు సంవత్సరాల డిగ్రీ కోర్సు టీజీ లాసెట్‌కు 41, 210 మంది అభ్యర్థులు, 5 సంవత్సరాల డిగ్రీ కోర్సుకు టీజీ లాసెట్‌కు 11,695 మంది అభ్యర్థులు, పీజీఎల్ సెట్ ఎల్ఎల్ఎంకు 4,810 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. టీజీ లాసెట్ 2025 పరీక్ష ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహించారు.






