- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ గ్రూపు-2 అభ్యర్థులకు BIG అలర్ట్
ఫలితాల కోసం ఎదురుచూస్తున్న గ్రూపు-2 అభ్యర్థులకు ఎట్టకేలకు ఓ స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: ఫలితాల కోసం ఎదురుచూస్తున్న గ్రూపు-2 అభ్యర్థులకు ఎట్టకేలకు ఓ స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. ఆదివారం మధ్యాహ్నం ఫలితాలు విడుదల చేస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. కాగా, దసరా పండగలోపు తుది ఫలితాలను వెల్లడించడంతోపాటు నియామకపత్రాలు అందించాలని TGPSC భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గ్రూప్-2లో 783 పోస్టుల భర్తీకి అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తిచేసింది. యూనిఫాం పోస్టులకు అర్హులైనవారి వైద్య నివేదికలూ అందాయి. అభ్యర్థుల విద్యార్హతలు, ఆప్షన్లు, మెరిట్, రిజర్వేషన్లు తదితర విషయాలు పరిగణనలోకి తీసుకుని తుది జాబితాను రూపొందించినట్లు సమాచారం. టీజీపీఎస్సీ 783 పోస్టులతో 2022లో గ్రూప్-2 నోటిఫికేషన్ జారీచేసింది. 2024 డిసెంబరులో రాత పరీక్ష నిర్వహించి... ఈ ఏడాది మార్చి 11న జనరల్ ర్యాంకుల జాబితాను వెల్లడించింది. ఎట్టకేలకు రేపు ఫలితాలు విడుదల అవుతాయని తెలుస్తోంది.






